“సంచలనం” సృష్టిస్తున్న జగన్ “ఏడు ప్రశ్నలు”   YS Jagan 7 Questions To CM Chandrababu     2018-04-07   09:25:47  IST  Bhanu C

ప్రతిపక్ష అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు పై విమర్శలు ఎక్కుపెట్టారు..ప్రత్యేక హోదా విషయంలో మేము మాట్లాడిన తరువాత ఇప్పుడు ఏపీ కి అన్యాయం జరిగింది అంటూ అరుస్తున్న చంద్రబాబు నీ చిత్త శుద్ది ఎంతవరకూ ఉంది అంటూ ప్రశ్నించారు అధికారం చేపట్టిన సమయం నుంచీ చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ఏమి పాటుపడ్డారో వివరించాలని డిమాండ్ చేశారు..ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ మొదట్నుంచి ఎన్నో ఉద్యమాలు, ధర్నాలు చేసిందన్నారు. మొదటగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి.. ఆంధ్రల గొంతుగా నిలిచామని అన్నారు..

చంద్రబాబు ఢిల్లీ పర్యటన హోదా ఉద్యమం నేపధ్యంలో జగన్ సీఎం కి లేఖ రాశారు.. ఢిల్లీ యాత్ర కోసం చర్చించడానికి అఖిల పక్షంతో చర్చించడానికి సమావేశం పెడుతున్నారట. అక్కడ హేమ మాలినితో ఏమి మాట్లాడారో చెప్పడానికట.. అంటూ ఎద్దేవా చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఎక్కడా హోదాపై అల్టిమేటం లేదన్నారు జగన్. తన ఎంపీలతో చంద్రబాబు రాజీనామాలు చేయించ కుండా ఉన్న నేపధ్యంలో మేము వాళ్లతో వెళ్లాలా.. అంటూ నిలదీశారు.


చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎలా సాగిందో అందరికీ తెలుసు కనీసం మాట్లాడటానికి ఎవరూ లరు..హేమా మాలినితో మాట్లాడారు నాలుగు ఫోటోలు దిగారు అంటూ ఎద్దేవా చేశారు..తన అవినీతి పై ఎక్కడ మోడీ విచారణ చేయిస్తారేమో అని చంద్రబాబు భయపడ్డారు అందుకే తమ ఎంపీలతో రాజీనామాలు చేయించలేదు అంటూ ఎద్దేవా చేశారు..చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టారని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఏడు ప్రశ్నలు సందించారు జగన్.

1 . ఏపీ లో ఎలాంటి ఉద్యోగాలు రాకపోయినా 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పలేదా? తలసరి ఆదాయం ఏపీ లో దేశం కంటే ఎక్కువని ప్రకటించలేదా?

2. సెప్టెంబర్ 2016 ప్యాకేజీపై అరుణ్ జైట్లే ప్రకటన చేశారు. టీడీపీ ఎంపీలను పక్కన పెట్టుకొని ఈ ప్రకటన చేశారు. బాబు కోరిక మేరకు ప్యాకేజి ఇస్తున్నామని జైట్లే చెప్పారు. అదే అర్ధరాత్రి అరుణ్ జైట్లీ ప్రకటనను స్వాగతించి పొగడలేదా? అసెంబ్లీ లో ధాన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టలేదా? హోదా నుంచి ఈశాన్య రాష్ట్రాలకు ఒరిగిందేమి అని బాబు అనలేదా?

3. మార్చ్ 2, 2014 రాష్ట్ర విభజనపై ప్లానింగ్ కమిషన్ వేశారు. 2014 జూన్ లో బాబు సీఎం అయ్యారు. అప్పటి వరకు ప్లానింగ్ కమిషన్ అమల్లో ఉంది. ఈ 7 నెలలపాటు ప్లానింగ్ కమిషన్ కు లేఖ రాయలా? చంద్రబాబు వెళ్లి కమిషన్ ను కలవలేదు. బాబు 7 నెలలు గాడిదలు కాశారా?

4. ప్రత్యేకహోదా కోసం నిరాహార దీక్ష చేస్తే మోదీ వస్తున్నాడని దీక్ష టెంట్ ను ఎత్తేయించలేదా? హోదా కోసం విధ్యార్థులు ఆందోళన చేస్తే పీడీ యాక్ట్ పెడతామని బెదిరించలేదా?

5. . హోదా విషయంలో ఎంపీల చేత రాజీనామా చేయించకపోవడం అన్యాయం కాదా? అలా చేయకుండా ఇప్పుడు అఖిలపక్ష పెరుతో డ్రామా ఆడుతున్నారు…ప్రత్యేక హోదా విషయంలో నిన్నటి వరకు ప్రజలను మోసం చేసి, ధర్నాలు, ఉద్యమాలు చేయకుండా ఇప్పుడు ర్యాలీ అంటూ మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

6. అవిశ్వాస తీర్మానానికి ఇతర పార్టీల మద్దతు రావడంతో టీడీపీ అవిశ్వాసం పెడతామని ప్రకటించలేదా? అఖిలపక్షం కార్యాచరణ ఆందోళన చేయారదట…కేవలం నల్ల బ్యాడ్జీలు పెట్టుకోవాలట..

7. వైసీపీ అవిశ్వాసం పెట్టి ఉండకపోతే చంద్రబాబు అవిశ్వాసం పెట్టి వుండేవాదా? సంఖ్య బలం ఉంటేనే అవిశ్వాసానికి మద్దతిస్తామని అనలేదా?