వైయస్ వివేక హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వివేకానంద రెడ్డి హత్య కేసు( YS Vivekananda Reddy Murder ) సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

రాజకీయంగా ఈ హత్య కేసు అధికార పార్టీనీ ఇరుకున పెడుతూ ఉంది.

ఈ హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి అరెస్టు కావడం తెలిసిందే.ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సీబీఐ( CBI ) అరెస్టు చేసి చంచల్ కూడా జైల్లో ఉంచడం జరిగింది.

అయితే తాజాగా భాస్కర రెడ్డికి మధ్యంతర బెయిల్ లభించింది.అనారోగ్యం కారణంగా తనకు 15 రోజులపాటు మద్యంతర బెయిల్ మంజూరు చేయాలని భాస్కర్ రెడ్డి( YS Bhaskar Reddy bail ) తరఫున హైదరాబాద్ సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేయడం జరిగింది.

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం 12 రోజులు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది.ఈ క్రమంలో ఎస్కార్ట్ వాహనంలోనే భాస్కర రెడ్డిని తరలించాలని.

Advertisement

ఎస్కార్ట్ కు అయ్యే ఖర్చులు కూడా ఆయనే భరించాలని సూచించింది.మద్యంతర బెయిల్ ముగిసిన అనంతరం.మళ్లీ కోర్టులో లొంగిపోనున్నారు.2019 ఎన్నికల సమయంలో జరిగిన ఈ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది.ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారిస్తూ ఉంది.

ఇదేందయ్యా ఇది.. అది కారా.. లేక గూడ్స్ రైలా..?
Advertisement

తాజా వార్తలు