రోజాపై ఫైర్ అయిన జగన్ భార్య       2018-05-09   03:23:54  IST  Bhanu C

వైసీపి ఫైర్ బ్రాండ్ రోజా గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి..రోజా కి ఫైర్ బ్రాండ్ కంటే ముందు ఐరెన్ లెగ్ అనే మరొక పేరు ఉండేది తానూ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రాదనే విషయం కూడతెలిసిందే అయితే రోజా ఆ ఐరెన్ లెగ్ ఇమేజ్ నుంచీ బయటకి రావడానికి తన నోటికి పని చెప్పి ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది..ఈ క్రమంలోనే తమ అధినేత వైఎస్ జగన్ దృష్టిలో పడటానికి ఎన్నో ఎన్నోన్నో జిమ్మిక్కులు వేసింది నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ఇష్టమొచ్చిన రీతిలో ప్రవర్తించడం చేస్తూ వైసీపి పరువుని తీస్తూ ఉండేది..

ఇప్పుడు ఆమెని ఫైర్ బ్రాండ్ అనడంకంటే కూడా “బూతు బ్రాండ్” అంటున్నారు..ఆమె చేసే చిల్లర పనులకి సామాన్యుల్లో అసహ్యం పుట్టుకొస్తోంది..అయితే ఈ విషయం నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో తేలిపోయింది దాంతో జగన్ అప్పుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి… మాటలు జాగ్రత్త అని చెప్పడమే కాదు.. చాలా రోజుల వైసీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా ఇవ్వలేదట…అయితే కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న రొజాని జగన్ బాబు పిలిచి మరీ మైక్ ఇవ్వడంతో రోజా నోటికి మళ్ళీ పట్టపగ్గాలు లేకుండా పోయాయి..ఆదెబ్బతో మరింత చెలరేగిపోయింది రోజా.

ఈ క్రమంలోనే దాచేపల్లి ఇష్యూ పై రాజకీయం చేసి లాభం పొందాలని భావించిన రోజా ఆ సంఘటనలో సైతం బూతులు వెతుక్కోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది..అంతేకాదు చంద్రబాబు టార్గెట్ గా ఇష్టానుసారంగా మాట్లాడారు…చంద్రబాబు పై చేసిన విమర్శలపై రోజాకి ఇంటాబయటా కూడా విమర్శలు ఎదురయ్యాయి..అయితే జగన్ కి ఎన్ని సార్లు చెప్పినా సరే రోజా కి సపోర్ట్ చేస్తూ ఉండటంతో చివరి ఈ విషయాన్ని జగన్ భార్య భారతికి తెలియచేశారట అయితే ఇటీవల కాలంలో పార్టీ వ్యవహారాలలో చురుకుగా ఉన్న భారతి…వెంటనే రోజాకు ఫోన్ చేసి దుమ్ము దులిపేశారట.

నువ్వు మాట్లాడేది కనీసం మన పార్టీలో ఉన్న మగ నేతలకి కూడా అసహ్యం పుట్టిస్తోంది..మరీ నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడితే ఎలా అంటూ ఫైర్ అయ్యారట..ప్రజలు ఏమనుకుంటున్నారో మీ చెవికి కూడా వినిపడక పొతే ఎలా అంటూ తెగ ఫైర్ అయ్యారట దాంతో ఖంగుతిన్న రోజా కి నోట మాట రాలేదట అయితే సహజంగానే తనని ఎవరు ఏమి అన్నా సరే తట్టుకోలేని రోజా భారతి పై రివర్స్ పంచ్ లు వేసిందట నేను ఏమైనా నా కోసం చేస్తున్నానా అంతా పార్టీ కోసమే కదా.. అంటూ విసురుగా ఫోన్ పెట్టేశారట..దాంతో షాక్ అయిన భారతికి ఏమి చేయాలో తెలియక సైలెంట్ అయ్యారని తెలుస్తోంది మరి ఈ పరిణామాలు ఎక్కడి వరకూ వెళ్తాయో వేచి చూడాల్సిందే..