ఆ సీక్రెట్ రీల్ బయటపెట్టిన యూట్యూబర్.. ఒరేయ్ అంటూ మెగా డాటర్ ఫైర్!

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో మంది సెలబ్రిటీలు అభిమానులకు దగ్గరవుతున్నారు.ఈ క్రమంలోనే ఒక సినిమాలో ఏదైనా బాగా ప్రాచుర్యం పొందిన డైలాగులు లేదా డాన్స్ వీడియోలను ఎంతోమంది చేస్తూ యూట్యూబ్ ద్వారా లేదా ఇంస్టాగ్రామ్ ద్వారా వాటిని అభిమానులతో పంచుకున్నారు.

 Youtuber Who Revealed That Secret Reel Mega Daughter Niharika Fires Details,  Yo-TeluguStop.com

ఇలా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా పుష్ప సినిమాలోని డైలాగులు డాన్స్ బాగా పాపులారిటీ దక్కించుకున్నాయి.ఈ క్రమంలోనే మెగా డాటర్ నిహారిక సైతం పుష్ప డైలాగు చెబుతున్నటువంటి వీడియోను యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహం తన ఇన్స్టాగ్రామ్ రీల్ ద్వారా బయట పెట్టారు.
ఈ క్రమంలోని వీరిద్దరూ పుష్ప సినిమాలోని ఎంతో ప్రాచుర్యం పొందిన డైలాగ్.ఏం పాపా.నచ్చినా నీకు అని చెప్పగా వెంటనే మెగా డాటర్ నిహారిక ఏ ఛీ.ఛీ నేనిన్ను సూలేదని ఓ పులిపెక్కి పోతున్నావ్ అంటగా.పులిపేక్కిపోతుండానా… అనే డైలాగ్ వీరిద్దరూ చేయగా ఈ వీడియోని నిఖిల్ విజయేంద్ర సింహ ఇంస్టాగ్రామ్ రీల్ ద్వారా బయట పెట్టారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే ఈ వీడియోపై ఎంతోమంది కామెంట్ల వర్షం కురిపించారు.

ఈ సందర్భంగా కొందరు ఈ వీడియో పై కామెంట్ చేస్తూ నిహారిక చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్లు చేయగా.మరికొందరు సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.ఎక్కువమంది ఈ వీడియో పై ఏడుపు ఎమోజీలను పెట్టడం గమనార్హం.

ఇక ఈ వీడియో పై నిహారిక స్పందిస్తూ… ఒరేయ్.నిఖిల్ గా అంటూ కామెంట్ చేశారు.

ప్రస్తుతం ఇది కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది.నిహారిక విషయానికి వస్తే ఈమె యాంకర్ గా, హీరోయిన్ గా అందరికీ సుపరిచితమే.

నిహారిక గత ఏడాది జొన్నలగడ్డ వెంకట చైతన్య ను వివాహం చేసుకున్న తర్వాత ఈమె ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే తన భర్త వెంకట చైతన్యతో కలిసి దిగిన ఫోటోలను ఈమె షేర్ చేస్తూ అభిమానులను మరింత పెంచుకుంటున్నారు.ఇదిలా ఉండగా నిహారిక సినిమాలకు దూరం అయినప్పటికీ నిర్మాతగా మారి వెబ్ సిరీస్ ను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే నిహారిక నిర్మాతగా వ్యవహరించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ కి నిర్మాతగా వ్యవహరించారు ఈ వెబ్ సిరీస్ జీ5 లో విడుదలై మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే నిహారిక మరి కొన్ని వెబ్ సిరీస్ ల నిర్మాణంలో ఎంతో బిజీగా ఉన్నారు.

Niharika Konidela With Nikhil Pushpa Reel #Pushpa

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube