రూ. 1 లక్ష విలువైన పెట్రోల్ ఫ్రీ.. యూట్యూబర్ బంపరాఫర్..!

ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి.లీటర్ పెట్రోల్ కొనాలంటే రూ.100కు పైగా వెచ్చించాల్సి వస్తోంది.డీజిల్ ధరలు కూడా దాదాపు ఇలాగే ఉన్నాయి.

 Youtuber Offers One Lakh Fuel Free For Making Video Viral Details, Free Petrol, Bumper Offer, Viral Latest, News Viral, Social Media Viral , Youtuber ,one Lakh Fuel Free ,making Video Viral, Crazy Xyz Youtuber, Youtuber Amit, Brilliant Idea, Petrol Diesel Free-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఒక యూట్యూబ్ ప్రజలకు ఒక లక్ష రూపాయల విలువైన పెట్రోల్ ఉచితంగా ఇస్తానని ప్రకటించాడు.అయితే తన వీడియోని వైరల్ చేస్తానని సబ్‌స్క్రైబర్లు హామీ ఇస్తేనే రూ.1 లక్ష ఖరీదైన ఫ్యూయల్ ఫ్రీగా ఆఫర్ చేస్తానని ఒక కండిషన్ పెట్టాడు.అయితే ఈ వీడియోని వైరల్ చేస్తామని ఫాలోవర్లు మాట ఇవ్వడంతో అతడు ఫ్రీగా పెట్రోల్ ఆఫర్ చేశాడు.

ఈ వీడియో సబ్‌స్క్రైబర్లు నిజంగానే వైరల్ చేశారు.

 Youtuber Offers One Lakh Fuel Free For Making Video Viral Details, Free Petrol, Bumper Offer, Viral Latest, News Viral, Social Media Viral , Youtuber ,one Lakh Fuel Free ,making Video Viral, Crazy Xyz Youtuber, Youtuber Amit, Brilliant Idea, Petrol Diesel Free-రూ. 1 లక్ష విలువైన పెట్రోల్ ఫ్రీ.. యూట్యూబర్ బంపరాఫర్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

క్రేజీ ఎక్స్‌వైజెడ్ అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న అమిత్ ఇంధన దానం చేశాడు.

ఈ వీడియోకి 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.అంటే అతను యూట్యూబ్ నుంచి ఇప్పటికే లక్ష రూపాయల వరకు సంపాదించి ఉండొచ్చని తెలుస్తోంది.

ఇంకొద్ది రోజుల్లో మరిన్ని డబ్బులు సంపాదించే అవకాశం ఉంది.అలా ఒక క్రియేటివ్ ఐడియాతో అటు ప్రజలకు, ఇటు తనకు ప్రయోజనం చేకూర్చుకుని అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు అమిత్.

వైరల్ అవుతున్న వీడియోలో అమిత్ ఒక పెట్రోల్ బంకు ముందు నిల్చొని “పెట్రోల్ ఫ్రీ” అనే ఒక బోర్డు పట్టుకుని వాహనదారులను పిలవడం చూడొచ్చు.ఆ తర్వాత ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా పెట్రోల్ అందించడం గమనించొచ్చు.ఈ వీడియో చూసిన నెటిజన్లు అమిత్ ను బాగా పొగుడుతున్నారు.ఈ యూట్యూబర్ దాతృత్వానికి ఫిదా అవుతున్నారు.కొంత ఖర్చు చేయడం ద్వారా మరింత డబ్బు సంపాదించాలనే అమిత్ అద్భుతమైన ఆలోచనను మరికొంత మంది నెటిజన్లు పొగుడుతున్నారు.ఈ వీడియోని మీరు కూడా వీక్షించండి.

అయితే ఈ పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందనేది మాత్రం తెలియరాలేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube