బిచ్చగాడిని ఆట పట్టించాలనుకున్నాడు.. చివరకు జైలు పాలయ్యాడు

ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో ఫ్రాంక్‌ వీడియోలను మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం.అవతలి వారిని భయపెట్టి లేదా కన్ఫ్యూజ్‌ చేసి వ్యూవర్స్‌కు కామెడీ పండించడమే ఫ్రాంక్‌ వీడియో.

 Youtuber Gets Jail Term For Frank Video With Bigger-TeluguStop.com

ఇండియాలో కాస్త తక్కువే అయినా అమెరికా లండన్‌ ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఫ్రాంక్‌ వీడియోలు భారీ ఎత్తున వస్తున్నాయి.యూట్యూబ్‌లో లక్షల డాలర్లు కురిపిస్తున్న కారణంగా ఫ్రాంక్‌ వీడియోలను చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.

అలా ఒక ఫ్రాంక్‌ వీడియోను చేసిన స్పెయిన్‌ యువకుడికి 15 నెలల జైలు శిక్ష పడింది.

బిచ్చగాడిని ఆట పట్టించాలనుకు

పూర్తి వివరాల్లోకి వెళ్తే.స్పెయిన్‌కు చెందిన కంగ్వారెన్‌ అనే కుర్రాడు కొంత కాలంగా ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ను రన్‌ చేస్తున్నాడు.అందులో ఫ్రాంక్‌ వీడియోలను పోస్ట్‌ చేస్తూ వచ్చాడు.

తాజాగా ఒక బిచ్చగాడితో ఫ్రాంక్‌ వీడియోను ప్లాన్‌ చేశాడు.రోడ్డు మీద వెళ్తున్న బిచ్చగాడిని పిలిచి తన వద్ద ఉన్న బిస్కట్స్‌ను తీసి ఇచ్చాడు.

ఆ బిస్కట్స్‌లో క్రీమ్‌కు బదులుగా టూత్‌ పేస్ట్‌ను పెట్టడం జరిగింది.ఆకలి మీద ఉన్న ఆ బిచ్చగాడు కంగ్వారెన్‌ ఇచ్చిన బిస్కట్స్‌ను ఆబగా తినడం మొదలు పెట్టాడు.

కొద్ది సమయం తర్వాత అతడికి వాంతులు అయ్యాయి.

బిచ్చగాడిని ఆట పట్టించాలనుకు

ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టగా కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్‌ వచ్చాయి, రోజుల్లోనే మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి.దాంతో ఆ వీడియోతో అతడికి దాదాపుగా రెండు వేల యూరోల ఆదాయం కూడా వచ్చింది.అయితే ఆ వీడియోను సుమోటోగా స్వీకరించిన స్పెయిన్‌ కోర్టు, పోలీసులు అతడిపై చర్యలకు సిద్దం అయ్యారు.

హింస లేకుండా ఒక వ్యక్తిని బాధ పెట్టిన కారణంగా అతడికి కోర్టు 15 నెలల జైలు శిక్ష విధించడంతో పాటు, ఆ బిచ్చగాడికి 15 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube