యూట్యూబ్‌లో సంపాదన.. ఏకంగా రాల్స్ రాయ్స్ కారు కొనేసిన వైనం!  

Indian Youtuber Gaurav Chaudhary Buys Rolls Royce, Youtube, Youtuber, Gaurav Chaudhary, Rolls Royce, Viral News - Telugu Gaurav Chaudhary, Rolls Royce, Viral News, Youtube, Youtuber

ప్రస్తుత జనరేషన్‌లో యూత్ తమకు ఏది నచ్చితే అందులో తమ కెరీర్‌ను సెట్ చేసుకుని తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.ఇక సోషల్ మీడియా పుణ్యమా అని వారి అభిరుచులకు తగ్గట్టుగా తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకోవడమే కాకుండా అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఊహించని సంపాదనతో దూసుకుపోతున్నారు.

 Youtuber Gaurav Chaudhary Rolls Royce

ఇటీవల కాలంలో యూట్యూబ్ ద్వారా అధిక సంపాదనతో రచ్చ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది.

కాగా కేవలం యూట్యూబ్ ఛానల్ ద్వారా తన కెరీర్‌‌ను సెట్ చేసుకోవడమే కాకుండా భారీ సంపాదనతో దూసుకుపోతున్న ఓ యూబ్యూబర్, ఏకంగా రాల్స్ రాయ్స్ కారు కొనేంత లెవెల్‌కు ఎదిగిపోయాడు.

యూట్యూబ్‌లో సంపాదన.. ఏకంగా రాల్స్ రాయ్స్ కారు కొనేసిన వైనం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

భారత్‌కు చెందిన గౌరవ్ చౌదరి అనే యూట్యూబర్, టెక్నాలజీకి సంబంధించిన రివ్యూలు ఇస్తూ తన యూట్యూబ్ ఛానల్‌లో వీడియోలు చేస్తుంటాడు.మొబైల్ ఫోన్లపై రివ్యూలు ఇస్తుండటంతో ఆయన యూట్యూబ్‌ను ఎక్కువ మంది వీక్షిస్తుంటారు.ఈ క్రమంలోనే ఆయన ఛానల్‌కు ఏకంగా 3.5 మిలియన్ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

దీంతో ఆయన తన యూట్యూబ్ చానల్ ద్వారా వచ్చిన మొత్తానితో ఓ లగ్జరీ రాల్స్ రాయ్స్ కారును కొనుగోలు చేశాడు.ఇప్పుడు ఈ వార్తతో ఆయన మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు.నెలకు దాదాపు రూ.20 లక్షలకు పైగా కేవలం యూట్యూబ్ వీడియోల నుండే సంపాదిస్తున్నాడంటే, ఆయన వీడియోలకు ఎంతటి క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.మరి మీరు కూడా ఇలా వీడియోలను యూట్యూబ్‌లో పెట్టి డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయండి.

#Rolls Royce #Youtube #Youtuber

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Youtuber Gaurav Chaudhary Rolls Royce Related Telugu News,Photos/Pics,Images..