సుశాంత్ పై ఫేక్ వీడియోలు చేసి ఫేమస్ అయ్యాడు… ఇప్పుడు బుక్ అయ్యాడు  

YouTuber Earned Over Rs 15 Lakh On fake Videos Of Sushant, Bollywood, Tollywood, Social Media, Fake News - Telugu Bollywood, Fake News, Fake Videos, Social Media, Sushant, Tollywood, Youtuber

సోషల్ మీడియా ప్రభావం ఇప్పుడు ప్రజలపై ఎక్కువగా ఉంది.ఒకప్పుడు చుట్టూ ఎం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి పేపర్ చూసేవారు.

TeluguStop.com - Youtuber Earned Over Rs 15 Lakh On Fake Videos Of Sushant

అందులో రాసిందే నిజమని నమ్మేవారు.అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంతర్జాతీయం అంతా అంతర్జాలంలోకి వచ్చేసింది.

మొబైల్ ఫోన్ పట్టుకొని ప్రపంచంలో ఎక్కడ, ఎప్పుడు, ఎం జరుగుతుందో క్షణాల్లో తెలుసుకుంటున్నాం.అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాకి నియంత్రణ లేకపోవడం వలన కొన్ని అసత్య కథనాలు, తప్పుడు ప్రచారాలు, అబద్ధాలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

TeluguStop.com - సుశాంత్ పై ఫేక్ వీడియోలు చేసి ఫేమస్ అయ్యాడు… ఇప్పుడు బుక్ అయ్యాడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కొంత మంది ఫేమ్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ వాటినే నిజమని నమ్మించే విధంగా కథనాలు సిద్ధం చేసి సోషల్ మీడియాలో పెడతారు.అలాంటి వార్తలని ప్రజలు కూడా నిజమని నమ్మేస్తూ ఉంటారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమా, రాజకీయం, మతం అనేది హాట్ టాపిక్స్ గా ఉన్నాయి.ఈ మూడు ఎక్కువగా ప్రజలని ఆకర్షిస్తూ ఉంటాయి.ఈ నేపధ్యంలో ఈ మూడు అంశాలని ప్రధానంగా చేసుకొని చాలా మంది తప్పుడు సమాచారాన్ని ప్రజలకి అందిస్తున్నారు.ఇష్టానుసారంగా కొంతమంది వ్యక్తిగత ఎజెండాలతో, కొంత మంది డబ్బు కోసం, కొంత మంది విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం యుట్యూబ్, పేస్ బుక్ లలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు.

ప్రజలు వీటినే నిజమని నమ్మేస్తూ వారిని ఫాలో అయిపోతున్నారు.అలా చాలా మంది లక్షల ఫాలోవర్స్ ని తమ్ముడు కథనాలు, ప్రచారాలతో పెంచుకుంటున్నారు.

ఇప్పుడు బీహార్ కు చెందిన రషీద్ సిద్దిఖీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి ఫేక్ స్టోరీల్ని క్రియేట్ చేసి భారీ ఎత్తున వ్యూస్ ను సంపాదించుకున్నాడు.ఈ వ్యూస్ తో 4 నెలల్లో 15 లక్షల్నిసంపాదించగా, ఒక్క సెప్టెంబర్ నెలలోనే 6.5 లక్షలను సంపాదించినట్లు తెలుస్తోంది.రాజ్ పుత్ మరణానికి ముందు అతని యూ ట్యూబ్‌కు 2 లక్షల సబ్ స్కైబర్స్ ఉండగా చనిపోయాక వారి సంఖ్య 3.70 లక్షలకు చేరింది.రాజ్ పుత్ తో పాటు ఇతర బాలీవుడ్ హీరోలు, హీరోయిన్ల గురించి ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడంతో పోలీసులు అతడిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

#Fake Videos #Sushant #Youtuber #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Youtuber Earned Over Rs 15 Lakh On Fake Videos Of Sushant Related Telugu News,Photos/Pics,Images..