టిక్ టాక్ కు దీటుగా యూట్యూబ్ మాస్టర్ స్కెచ్... అదే జరిగితే ...?

టిక్ టాక్ ఈ యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.చైనా దేశానికి చెందిన బైట్ డాన్స్ మాతృసంస్థ లోని ఒక భాగమే ఈ టిక్ టాక్.భారతదేశంలో అత్యధికంగా ఉపయోగించే సోషల్ మీడియా ఒకటిగా టిక్ టాక్ పేరుగాంచింది.2016 సంవత్సరంలో మొదలైన ఈ టిక్ టాక్ యావత్ ప్రపంచ దేశాల్లో అతి తక్కువ కాలంలో చాలా క్రేజ్ సంపాదించుకుంది.ఇకపోతే ఈ యాప్ ను ప్రపంచ దేశాల్లో కంటే భారతదేశం లోనే ఎక్కువ ప్రాముఖ్యం తెచ్చుకుంది.భారతీయులు అత్యధిక సమయం ఉపయోగించే సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ టిక్ టాక్ అట.

 Youtube, Tiktok App,youtube To Launch Shorts App, Shorts App,china App, Boycott-TeluguStop.com

ఇకపోతే ఈ టిక్ టాక్ యాప్ ద్వారా కొంత మందికి మేలు జరిగితే… మరికొంతమంది ప్రాణాలు పోయాయి.ఒకవైపు ఇది ఇలా ఉంటే మరోవైపు గల్వాన్ సంఘటన తర్వాత భారత్ లో చైనా వ్యతిరేక సెంటిమెంట్ ఒక్కసారిగా ఊపందుకుంది.

దేశం మొత్తం చైనా ఉత్పత్తులను పూర్తిగా బాయ్ కాట్ చేయాలంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమమే జరుగుతోంది.ఇదే నేపథ్యంలో గత రాత్రి కేంద్ర ప్రభుత్వం చైనా దేశానికి సంబంధించిన 50 పైగా యాప్ లను నిషేధించిన సంగతి విధితమే.

అందులో టిక్ టాక్ మొదటి స్థానంలో ఉంది.ఇక ఇదే నేపథ్యంలో టిక్ టాక్ ను దెబ్బతీసేందుకు యూట్యూబ్ కొత్త ఫీచర్ తో ముందుకు రాబోతోంది. షార్ట్స్ అనే పేరుతో అచ్చం టిక్ టాక్ లాగే ఓ సరికొత్త యాప్ ను గూగుల్ కు చెందిన యూట్యూబ్ త్వరలో తీసుకు రాబోతోంది.

ఇందుకు సంబంధించి ఇప్పటికే ఈ ఫీచర్ ను అనేక రకాలుగా పరీక్షిస్తున్నట్లు యూట్యూబ్ వెల్లడించడం జరిగింది.

అతి త్వరలో దీన్ని భారీ ఎత్తున లాంచ్ చేస్తున్నామని గూగుల్ అధికారులు తెలుపుతున్నారు.ఇందులో అచ్చం టిక్ టాక్ లో ఉండే ఫిల్టర్లు, మ్యూజిక్ సపోర్ట్ మొదలగు ఫీచర్లు…, అలాగే మరికొన్ని కొత్త ఫీచర్స్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.

వీటితో పాటు కేవలం 15 సెకన్ల వీడియోని మాత్రమే పోస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.అంతేకాదు మన ఫోన్ గ్యాలరీ నుండి నేరుగా అప్లోడ్ చేసే విధంగా కూడా ఈ యాప్ రూపుదిద్దుకుంటుంది.

ఒకవేళ యూట్యూబ్ కు సంబంధించిన ఈ యాప్ లాంచ్ అయితే టిక్ టాక్ కు గట్టి దెబ్బ పడనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube