ఫుల్లుగా తాగి నగరంలో బీభత్సం సృష్టించిన యూట్యూట్ స్టార్.. ?

ఒక స్దాయి వచ్చేదాక పడిన కష్టాన్ని మరచిపోయి నలుగురిలో పేరు రాగానే తామే తోపులమనుకుంటు రుబాబు చేసేవారు ఎందరో నిత్యం అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు.అయితే పేరు ప్రతిష్టలు రావడం గొప్పకాదు.

 Youtube Star Who Created A Lot Of Drunken-TeluguStop.com

ఆ వచ్చిన వాటిని కాపాడుకోవడమే అసలైన కష్టం.

ఇకపోతే నేడు సమాజంలో సెలబ్రీటీగా ఎదగడానికి ముందున్న అవకాశాలు ఎన్నో అలాగే దిగజారి పోవడానికి కూడా అన్నే అవకాశాలు కళ్లముందు కనిపిస్తాయి.

ఇలాగే ఓ యూట్యూట్ స్టార్ ప్రస్తుతం నలుగురిలో నవ్వులపాలైన ఘటన వెలుగులోకి వచ్చింది.ఆ వివరాలు చూస్తే.

సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్‌సిరీస్‌తో అందరికీ పరిచయమైన యూట్యూట్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ తప్పతాగి జూబ్లీహిల్స్‌లో ఏకంగా మూడు వాహనాలను ఢీకొట్టాడట.కాగా ఈ ప్రమాదంలో టూవీలర్ వాహనదారునికి తీవ్రగాయాలు అయ్యాయట.

ఇక ఈ ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకుని బ్రీత్ ఎనలైజర్ ‌లో జశ్వంత్ ను చెక్ చేస్తే 170 పాయింట్లు వచ్చినట్టు తెలిపారు.అనంతరం కేసు నమోదు చేసుకున్నారట పోలీసులు.

#Accidents #Drunk Driving #Harassment #YouTube Star

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు