చిన్న వయసులోనే హార్ట్ అటాక్ తో యూట్యూబ్ స్టార్ కన్నుమూత.. దీప్తి సునైనా దిగ్భ్రాంతి!

Youtube Star Shriya Muralidhar Died Age 27 Due Cardiac Arrest

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఒకరి తరువాత మరొకరు మరణిస్తూనే ఉన్నారు.

 Youtube Star Shriya Muralidhar Died Age 27 Due Cardiac Arrest-TeluguStop.com

ఒకరు చనిపోయి ఆ బాధ నుంచి ఇంకా కోలుకోకముందే మనకు సంఘటనలు జరుగుతున్నాయి.ఇప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు చనిపోగా తాజాగా టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది.

ప్రముఖ యూట్యూబర్,సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ శ్రీయ మురళీధర్ మృతి చెందారు.డిసెంబర్ 7 న ఈమె గుండెపోటుతో మరణించింది.7వ తేదీ రాత్రి ఆమెకు చాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.

 Youtube Star Shriya Muralidhar Died Age 27 Due Cardiac Arrest-చిన్న వయసులోనే హార్ట్ అటాక్ తో యూట్యూబ్ స్టార్ కన్నుమూత.. దీప్తి సునైనా దిగ్భ్రాంతి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్లు స్పష్టం చేశారు.

యూట్యూబ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీయ మురళీధర్ యాంకర్ ప్రదీప్ రియాల్టీ షో పెళ్లిచూపులు షో లో కంటెస్టెంట్ గా పాల్గొంది.అంతేకాకుండా పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది.

అలాగే బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో యాంకర్ గా కూడా వ్యవహరించింది.ఈమె బ్యూటీ అండ్ ద బాస్ సీజన్ 2లో ఓ పాత్ర చేసింది.

అలాగే వాట్ ద ఫన్ అనే యూట్యూబ్ ఛాన‌ల్‌లో ఆమె చేసిన పలు వీడియోలు నెటిజన్ లను బాగా ఆకట్టుకున్నాయి.

ఈ నేపథ్యంలోనే శ్రియ మురళీధరన్ త్వరలోనే వెండితెరపై కనిపించాలని ఎంతో ఆశగా ఎదురు చూసింది.అయితే వెండితెరపై అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా ఈ యంగ్ యూట్యూబర్ అర్థాంతరంగా చనిపోవడం పలువురిని బాధిస్తోంది.శ్రీయా మురళీధర్ స్వస్థలం హైదరాబాద్‌లోని లక్డీకాపూల్.

కాగా శ్రీయా మృతి పట్ల యూట్యూబ్స్టార్‌ దీప్తీ సునైనా, సినీ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రిత, ఎగ్జిక్యూటివ్ నిర్మాత శివ చెర్రీతో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.ఈమె మరణవార్త తెలిసిన పలువురు ప్రముఖులు, యాంకర్ లు ఆమెకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

#YouTube #Breath #YoutuberShriya #Deepthi Sunaina

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube