యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ కాలికి గాయం.. టెన్షన్ లో అభిమానులు?

ప్రేక్షకులకు ఎన్ని ఓటీటీలు అందుబాటులో ఉన్నా తొలి ప్రాధాన్యత మాత్రం యూట్యూబ్ కు మాత్రమేననే సంగతి తెలిసిందే.యూట్యూబ్ లో ఫ్రీగా వీడియోలు చూసే అవకాశంతో పాటు మనం అప్ లోడ్ చేసిన వీడియోల ద్వారా డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉంటుంది.

 Youtube Star Shanmukh Jaswanh Leg Injury Goes Viral In Social Media , Shanmukh J-TeluguStop.com

ఎంతోమంది యూట్యూబ్ ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నారు.అలా యూట్యూబ్ ద్వారా ఎక్కువ మొత్తం డబ్బు సంపాదిస్తున్న వాళ్లలో షణ్ముఖ్ జశ్వంత్ ఒకరు.

యూట్యూబ్ లో షణ్ముఖ్ జశ్వంత్ కు 42 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.అయితే బిగ్ బాస్ షో ద్వారా షణ్ముఖ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత ఎక్కువగా పెరిగింది.

యూట్యూబర్ గా మంచి పేరు సొంతం చేసుకున్న షణ్ముఖ్ కు బిగ్ బాస్ షో వల్ల ఆర్థికంగా ప్రయోజనం చేకూరినా వ్యక్తిగతంగా మాత్రం షణ్ముఖ్ కు ఈ షో మైనస్ అయింది.దీప్తి సునైనాతో షణ్ముఖ్ గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు.

అయితే బిగ్ బాస్ షోలో చోటు చేసుకున్న ఘటనల వల్ల ఈ జంట విడిపోయింది.అయితే తాజాగా షణ్ముఖ్ తన కాలికి గాయం అయిందంటూ ఒక ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.షణ్ముఖ్ జశ్వంత్ గాయాన్ని చూసిన అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు.షణ్ముఖ్ జశ్వంత్ కు ఏ విధంగా దెబ్బ తగిలిందని ఆరా తీస్తున్నారు.మరి కొందరు మాత్రం ఆ గాయం పాత గాయమేనని చెబుతున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో షణ్ముఖ్ కు ఐస్ టాస్క్ లో భాగంగా ఆ గాయమైందని అభిప్రాయపడుతున్నారు.షణ్ముఖ్ ఆ గాయం గురించి స్పందించి వివరణ ఇస్తారేమో చూడాల్సి ఉంది.షణ్ముఖ్ మళ్లీ యాక్టివ్ కావాలని యూట్యూబ్ లేదా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube