మరింత చిక్కుల్లో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్..!!

వెబ్ మీడియాలో ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి పాపులారిటీ షణ్ముఖ్‌ జస్వంత్ అనే కుర్రాడు దక్కించుకున్న సంగతి తెలిసిందే.అదేరీతిలో “సూర్య” అనే వెబ్ సిరీస్ కూడా షణ్ముఖ్‌ జస్వంత్ ఇటీవల స్టార్ట్ చేసి తన సొంత యూట్యూబ్ చానల్లో రిలీజ్ చేయడం జరిగింది.

 Youtube Star Shanmukh In More Trouble-TeluguStop.com

ఈ రెండు వెబ్ సిరీస్ కి మంచి ఆదరణ రావటంతో .ప్రాఫిట్ భారీ స్థాయిలో వస్తున్నట్లు టాక్.దీంతో మనోడు పాపులర్ అయిపోవడంతో టెలివిజన్ రంగంలో పలు షో లకు .అతిథిగా రావటం కూడా ఇటీవల మనం చూశాం.దీంతో రోజురోజుకీ క్రేజ్ షణ్ముఖ్‌ జస్వంత్ పెరుగుతూ ఉన్న తరుణంలో తాజాగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో యాక్సిడెంట్ చేయటంతో .పైగా అదే టైంలో డ్రింక్ చేసి ఉండటంతో మనోడు గ్రాఫ్ ఒక్కసారిగా కింద పడి పోయినట్లు అయింది.
ఫుల్లుగా తాగి కారు తో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తులను ఢీకొనడంతో .పోలీసులు పట్టుకుని  బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా.170 రీడింగ్ చూపించడం జరిగింది.దీంతో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్‌ జస్వంత్ పై జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 337, 279 కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఆ టైంలో స్టేషన్ బెయిల్ పై విడుదలైన షణ్ముఖ్‌ జస్వంత్.తాజాగా పోలీసులు తల్లిదండ్రుల సమక్షంలో ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ కి హాజరు కాకుండా, పోలీసులు ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోకుండా ఉండటంతో పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.

 Youtube Star Shanmukh In More Trouble-మరింత చిక్కుల్లో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కౌన్సిలింగ్ కి హాజరు కాకపోవడంతో పోలీసులు కోర్టు ప్రొసీడింగ్స్ కి సిద్ధమవుతున్నట్లు.ఇదే జరిగితే షణ్ముఖ్‌ జస్వంత్ మరింత చిక్కుల్లో పడినట్లే అని న్యాయనిపుణులు హెచ్చరిస్తున్నారు.

.

#Drunk And Drive #Surya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు