తెలుగు నెటిజన్స్‌కు స్వాతి నాయుడును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.యట్యూబ్లో ఈమె సంచలన వీడియోలు చేసి చాలా ఫేమస్ అయ్యింది.
ఒకప్పుడు షకీలా ఏ స్థాయిలో మలయాళ సినీ పరిశ్రమను షేక్ చేసిందో అంతే స్థాయిలో యూట్యూబ్‌లో ఈమె వీడియోలతో షేక్ చేసింది.ఈమె ప్రతి వీడియో కూడా మిలియన్స్ కొద్ది వ్యూస్‌ను దక్కించుకున్నాయి.
ఈమె ఎన్నో బూతు చిత్రాల్లో నటించింది.ఆ చిత్రాలన్ని కూడా యూత్ ఆడియన్స్‌కు మత్తెక్కించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
స్వాతి నాయుడు ప్రతి కుర్రాడికి పరిచయం అయిన తెలుగుమ్మాయి.ఒక తెలుగు అమ్మాయి మరీ ఇంత బరితెగించి వీడియోలు చేయడం ఏంటీ అంటూ విమర్శలు కూడా వచ్చాయి.అయితే ఆమె అవన్ని ఏమీ పట్టించుకోకుండా వెండి తెర మరియు బుల్లి తెర తనను కాదనుకున్నందుకు ఇదే తనకు గుర్తింపు తెచ్చి పెట్టిందని యూట్యూబ్ గురించి స్వాతి నాయుడు చెబుతూ వచ్చింది.
తాజాగా స్వాతి నాయుడు పెళ్లి చేసుకుంది.ఈమె పెళ్లి గురించిన వార్తలు వచ్చినా కూడా వాటిని ఎవరు ముందుగా పట్టించుకోలేదు.కాని తాజాగా స్వాతి నాయుడు స్వయంగా మీడియా ముందుకు వచ్చి ప్రకటించిన నేపథ్యంలో నిజం అని తేలిపోయింది.
అవినాష్ అనే వ్యక్తితో స్వాతి నాయుడుకు విజయవాడలో వివాహం అయ్యింది.వివాహ కార్యక్రమాన్ని ఇరు వర్గాల బంధు మిత్రులు మరియు కుటుంబ సభ్యులు దగ్గరుండి మరీ జరిపించారు.స్వాతి నాయుడు వివాహం వైభవంగా జరిగింది.అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.ఈ పెళ్లి వీడియోల్లో తన కుటుంబ సభ్యులను సైతం స్వాతి నాయుడు ప్రేక్షకులకు పరిచయం చేసింది.స్వాతి నాయుడు వివాహం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.