అయ్యో ట్రంప్: ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల బాటలో యూట్యూబ్ కన్నెర్ర

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇప్పట్లో కష్టాలు వదిలేలా కనిపించడం లేదు.క్యాపిటల్ భవనంపై ఆయన వర్గీయుల దాడితో వున్న కాస్త పరువు గంగ పాలైంది.

 Youtube Removes New Content From Donald Trump's Channel, Us President Donald Tru-TeluguStop.com

ఈ ఘటనతో తమ నిబంధనలు ఉల్లంఘించేలా వ్యవహరించారంటూ సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లు ట్రంప్ ఖాతాను బ్లాక్ చేశాయి.అయితే ఒక అడుగు ముందుకేసిన ట్విట్టర్ ఆయన ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది.

ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి యూట్యూబ్ చేరింది.

తమ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకుగాను డొనాల్డ్‌ ట్రంప్‌ యూట్యూబ్‌ ఛానల్‌ను వారం పాటు నిలిపేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

ఇటీవల ట్రంప్ ఛానల్‌లోని ఒక వీడియో హింసను ప్రేరేపిస్తున్నట్లుగా ఉందని పేర్కొంటూ యూట్యూబ్‌ దానిని తొలగించింది.అయితే అది ఏ వీడియో అన్నది చెప్పని యూట్యూబ్.ట్రంప్‌ ఛానల్‌కు స్ట్రైక్‌ (హెచ్చరిక) ఇచ్చినట్లు పేర్కొంది.ఇందుకు శిక్షగా ఒక వారం పాటు ఆ ఛానెల్‌లో ఎలాంటి అప్‌లోడింగ్‌లు చేయకుండా బ్లాక్ చేసింది.

ఏడు రోజుల తర్వాత ట్రంప్ ఛానల్‌పై తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.

Telugu Attack, Donaldtrump, Trump, Donald Trump-Telugu NRI

అయితే ఈ నిబంధనలు వారం తర్వాత పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయని యూట్యూబ్‌ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.అంతేకాకుండా ట్రంప్‌ ఛానల్‌లో కామెంట్స్‌ సెక్షన్‌ను కూడా డిజేబుల్‌ చేసినట్లు యూట్యూబ్‌ వెల్లడించింది.కాగా యూట్యూబ్ అనుసరిస్తున్న నిబంధనల ప్రకారం.

రెండోసారి స్ట్రైక్‌ వస్తే ఛానల్‌పై రెండు వారాల సస్పెన్షన్‌, మూడు సార్లు స్ట్రైక్‌ వస్తే ఛానల్‌ను పూర్తిగా తొలగిస్తారు.

కాగా, ట్రంప్ ఖాతాను నిషేధించిన ప్రభావం ట్విటర్‌పై బాగానే పడింది.

ఆయన ఖాతాను నిలిపివేయడం వల్ల ఆ సంస్థకు ఏకంగా 5 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్టు అంచనా.( భారత కరెన్సీ ప్రకారం 36 వేల కోట్ల రూపాయలు)ను ట్విటర్ నష్టపోయింది.

అదే సమయంలో ట్విటర్ షేర్ 12 శాతం కుప్పకూలింది.ట్రంప్‌కు దాదాపు 88 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

అలాగే ట్రంప్ మద్ధతుదారులకు చెందిన 70 వేల అకౌంట్లను సైతం ట్విటర్ రద్దు చేయడంతో ఈ స్థాయిలో నష్టం వాటిల్లిందని నిపుణుల అంచనా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube