యూట్యూబ్ టిక్ టాక్ షురూ…!  

tiktak, tiktak shorts, youtube, pubg, america, shorts videos - Telugu America, Pubg, Shorts Videos, Tiktak, Tiktak Shorts, Youtube

భారతదేశంలో ప్రజల భద్రత కారణాల దృష్ట్యా భారతదేశ ప్రభుత్వం చైనీస్ యాప్స్ ను బ్యాన్ చేసిన సంగతి అందరికీ విదితమే.ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యం చెందిన టిక్ టాక్, పబ్ జి ఆటను కూడా రద్దు చేసింది మోడీ సర్కార్.

TeluguStop.com - Youtube Launches Own Competitor Tiktok

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇక భారత్ తర్వాత ఆస్ట్రేలియా, అమెరికా దేశాలు కూడా వారి దేశాలలో టిక్ టాక్ బ్యాన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.ఇదివరకే అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ టిక్ టాక్ విషయంలో సెప్టెంబర్ 20వ తారీకు లోపల అమెరికా దేశానికి సంబంధించిన టిక్ టాక్ ను వేరే ఏదైనా స్థానిక సంస్థకు అప్పగించకపోతే దానిని పూర్తిగా నిషేధించాలని హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

TeluguStop.com - యూట్యూబ్ టిక్ టాక్ షురూ…-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో ప్రస్తుతం అమెరికాలో టిక్ టాక్ ను సొంతం చేసుకోవడానికి ఒరాకిల్ సన్నాహాలు మొదలుపెట్టింది.

ఒకవైపు పరిస్థితి అలా ఉంటే, మరో వైపు టిక్ టాక్ కు పోటీగా ఎన్నో కొత్త అప్లికేషన్లు రోజురోజుకి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి.

ఇప్పటికే భారతదేశంలో చింగారి, ఇంస్టాగ్రామ్ రూల్స్ బాగా ట్రెండింగ్ గా కొనసాగుతున్నాయి.ఇక తాజాగా ప్రముఖ వీడియో షేరింగ్ యాప్… గూగుల్ సంబంధించిన యూట్యూబ్ కూడా ‘ షార్ట్స్ ‘ అనే పేరుతో టిక్ టాక్ లాగానే తక్కువ నిడివి ఉన్న వీడియోలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

యూట్యూబ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని తెలిపింది.ఇకపోతే ఈ షార్ట్స్ అనే ఆప్షన్ ని కేవలం మొబైల్ యాప్ గా మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు.

ఇక ఈ షార్ట్స్ లో 15 సెకన్ల నిడివిలో ఉన్న లఘుచిత్రాలు మాత్రమే చిత్రీకరించే అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.అయితే ఈ అప్లికేషన్ ప్రస్తుతం కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

అతి త్వరలోనే ఐఓఎస్ యూజర్లు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.మరికొన్ని ఫీచర్స్ ను ఇందుకు జత చేసి ఇతర దేశాల్లో కూడా విస్తరిస్తామని కంపెనీ తెలియజేసింది.

ప్రస్తుతానికి ఈ యాప్ లో స్పీడ్ కంట్రోల్, కౌంట్ డౌన్ లాంటి కొన్ని ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

#Tiktak Shorts #Youtube #Tiktak #Shorts Videos #Pubg

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Youtube Launches Own Competitor Tiktok Related Telugu News,Photos/Pics,Images..