వైరల్: ఇదేం రాజీనామా లేఖ బాబోయ్.. నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..!

ఈ రోజుల్లో రాజీనామా లేఖలు చాలా సింపుల్ గా రాయటం ఒక ట్రెండ్‌గా మారుతోంది.ఈ కోవకు చెందిన ఒక లెటర్ ఈమధ్య వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

 Youtube India Shared Viral Resignation Letter Details, Viral Latest, News Viral,-TeluguStop.com

ఈ లేఖలో ఉద్యోగి “బై, బై సర్” అని సింపుల్‌గా, సుత్తిలేకుండా తన రాజీనామా లేఖను ముగించాడు.తాజాగా అలాంటి మరొక లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది.

దీనిని యూట్యూబ్ ఇండియా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసింది.ఈ లేఖ చదివిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

రిజైన్ లెటర్ భలే సింపుల్ గా రాశారు, కదా! సూపర్ అంటూ కొందరు ఈ లేఖ రాసిన ఉద్యోగిని పొగుడుతున్నారు.

వైరల్ అవుతున్న రిజైన్ లెటర్‌లో ఏం రాసుందంటే.‘ఎవరు ఏమనుకున్నా, సరే.ఇక ఖతం చేద్దాం!’ అని ఆ ఎంప్లాయ్ రాశాడు.ఈరోజుతో ఖేల్ ఖతం దుకాణం బంద్ అన్నట్లుగా అతడు తన ఉద్యోగాన్ని మానేస్తున్నానని చెప్పడం చూసి నెటిజన్లు చాలా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.సాధారణంగా ఎవరైనా తాము ఎందుకు మానేస్తున్నామో వివరంగా కారణం చెప్తారు కానీ ఈ ఎంప్లాయ్ ఏంటి ఇలా చేశాడు అని కొందరు నోరెళ్లబెడుతున్నారు.

చాలా ఫార్మల్ గా, గౌరవంగా రాసే రాజీనామా లేఖలనే ఇప్పటి వరకు చూశాం కానీ ఇలాంటి లేకుండా చూడటం ఇదే తొలిసారి అని ఒక ట్విట్టర్ యూజర్ కామెంట్ పెట్టాడు.

ఈ ఫన్నీ రిజైన్ లెటర్‌ను పోస్ట్ చేస్తూ యూట్యూబ్ ఇండియా ‘గుడ్ రిజిగ్నేషన్ లెటర్’ అని కూడా క్యాప్షన్ జత చేసింది.ఈ పోస్ట్ రెండు రోజుల క్రితం షేర్ చేయగా దీనికి ఇప్పటికే 9 వేల లైకులు, వందలకొద్దీ రీ-ట్వీట్స్‌, రిప్లైలు వచ్చాయి.డైరెక్ట్ గా పాయింట్‌కి వచ్చిన ఈ ఉద్యోగిని చాలా మంది పొగుడుతున్నారు.

మీరు కూడా ఈ లెటర్ పై ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube