వారికి యూట్యూబ్ ప్రోత్సాహకాలు.. భారీ నిధి ఏర్పాటు..!

భద్రతా కారణాల రిత్యా భారత ప్రభుత్వం టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన సంగతి అందరికీ విదితమే.కాగా, టిక్ టాక్‌కు ఆల్టర్నేట్‌గా మార్కెట్‌లో బోలెడన్ని దేశీ యాప్స్ వచ్చాయి.

 Youtube Incentives For Them Huge Fund Set Up-TeluguStop.com

ఈ క్రమంలోనే యూట్యూబ్ షార్ట్ వీడియోస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.కొవిడ్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ కాలంలో యూట్యూబర్స్ పెరిగిపోవడం గురించి అందరికీ తెలిసే ఉంటుంది.

ప్రతీ ఒక్కరు దాదాపుగా యూట్యూబ్‌లో డిఫరెంట్ కంటెంట్ క్రియేట్ చేసి తద్వారా మనీ పొందాలని అనుకుంటున్నారు.అటువంటి యూట్యూబర్స్‌కు యూట్యూబ్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పంది.

 Youtube Incentives For Them Huge Fund Set Up-వారికి యూట్యూబ్ ప్రోత్సాహకాలు.. భారీ నిధి ఏర్పాటు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వ్యూస్ ఆధారంగా డబ్బులు ఇచ్చే సంస్థ ప్రజెంట్ వారి కోసం సెపరేట్‌గా నిదులు కేటాయించింది.తద్వారా యూట్యూబర్స్‌కు మరింత ప్రోత్సాహం ఇచ్చేందుకు రెడీ అయింది.

ఇందుకుగాను వంద మిలియన్ డాలర్ల నిధి ఏర్పాటు చేసిన యూట్యూబ్ వందల డాలర్ల నుంచి పది వేల డాలర్ల వరకు యూట్యూబర్స్ రివార్డ్స్ ఇవ్వనుంది.

ఈ ఏడాది నుంచి వచ్చే ఏడాదికి మధ్యలో వైరలైన షార్ట్ వీడియోస్ క్రియేటర్స్‌కు నగదును ఈ నిధి నుంచి యూట్యూబ్ అందించనుంది.

అయితే, వీడియోలకు వచ్చే వ్యూస్‌ను ఆధారం చేసుకునే రివార్డ్స్ ఉంటాయని సంస్థ వెల్లడించింది.షార్ట్ వీడియోలు అప్‌లోడ్ చేసే క్రియేటర్స్ బోనస్ చెల్లింపుల కోసమై క్లెయిమ్స్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇందుకు వారు సెపరేట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.యూ ట్యూబ్ కండిషన్స్ క్వాలిఫై అయ్యాకనే మనీ ఇస్తుంది సంస్థ.

ఈ ఫండ్ ద్వారా భారతదేశంలో ఉన్న యూట్యూబర్స్ లేదా షార్ట్ వీడియోస్ క్రియేటర్స్‌కు మాత్రమే కాకుండా బ్రెజిల్, అగ్రారాజ్యం అమెరికా, జపాన్, నైజీరియా, దక్షణాఫ్రికా, మెక్సికో, ఇండోనేషియా, బ్రెజిల్ కంట్రీస్ క్రియేటర్స్‌కు ప్రోత్సహకాలు ఇవ్వనున్నట్లు యూట్యూబ్ సంస్థ తెలిపింది.షార్ట్ వీడియోస్‌కు సామాన్య ప్రజానీకం ఆల్రెడీ అడిక్ట్ అయ్యారనే చెప్పొచ్చు.

స్మార్ట్ ఫోన్ ప్రతీ ఒక్కరు షార్ట్ వీడియో కంటెంట్ క్రియేషన్ కోసం ప్రయత్నించడం మనం పరిశీలించొచ్చు.

#Tiktolk #Japan #Indonesia #QualifyYouTube #Mexico

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు