క‌రోనా దెబ్బ‌తో ప్ర‌పంచంలో స‌గం మంది యువతకు కొత్త ముప్పు!

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్‌.ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లను, ప్ర‌భుత్వాల‌కు అల్ల‌క‌ల్లోలం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

 Youth Under Depression Amid Covid -19! Youth, Depression, Coronavirus, Covid-19,-TeluguStop.com

క‌రోనా ధాటికి చిన్న చిన్న దేశాల‌తో పాటు అగ్ర‌దేశాలు సైతం చిగురుటాకులా వ‌ణికిపోతున్నాయి.యుద్ధాలు చేసినపుడు కూడా జరగని ప్రాణ నష్టం.

ఈ మాయ‌దారి క‌రోనా వ‌ల్ల జ‌రుగుతుందంటే ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు.

క‌రోనా వ‌చ్చి ఎనిమిది నెల‌లు గ‌డుస్తున్నా.

భారత్ సహా అనేక దేశాల్లో పాజిటివ్ కేసులు, దానికి అనుగుణంగా మరణాలు భారీ సంఖ్య‌లో పెరుగుతూనే ఉన్నాయి.ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా రెండు కోట్లు దాటేయ‌గా.మ‌ర‌ణాల సంఖ్య 7.5 ల‌క్ష‌ల‌కు చేరువ అవుతోంది.ఇలాంటి త‌రుణంలో రోజుకో షాకింగ్ విష‌యం బ‌య‌టప‌డుతూ.మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తోంది.

Telugu Coronavirus, Coronavirus Ups, Covid, Latest-

ఇక తాజాగా జ‌రిపిన స‌ర్వేలో.క‌రోనా ప్ర‌పంచంలోని దాదాపు సగం మంది యువతను కుంగుబాటులోకి, ఆందోళనలోకి నెట్టేసింద‌ట‌.ప్రతి ఇద్దరిలోనూ ఒకరు అంటే యాబై శాతం మంది మానసిక కుంగుబాటు ముప్పును ఎదుర్కొంటున్నట్టు స‌ర్వేలో వెల్ల‌డైంది.క‌రోనా దెబ్బ‌తో ఉపాధి కోల్పోయి కొందరు, వేతనాల్లో కోతతో మరికొందరు తీవ్ర‌ మానసిక కుంగుబాటుకు గురవుతున్నట్టు గుర్తించారు నిపుణులు.

‘యువత- కొవిడ్19: వారి ఉద్యోగాలు, విద్య, హక్కులు, మానసిక స్థితిపై ప్రభావం’ పేరిట ఐఎల్ఓ నిర్వహించిన స‌ర్వ‌లో.ప్ర‌పంచ‌వ్యాప్తంగా 18 నుంచి 29 ఏళ్ల లోపు యువతపై క‌రోనా ప్రతికూల ప్రభావం ఎక్కువ‌గా ప‌డుతుంద‌ని తెలుసుకున్నారు.

చదువులో ఫెయిల్ అవుతామేమోనన్న భ‌యంతో 22 శాతం మంది, భవిష్యత్తు ఏమైపోతుందో అని 38 శాతం మంది, ఉద్యోగం పోయి మ‌రికొంత‌మంది మానసిక కుంగుబాటు గుర‌వుతున్నార‌ని వెల్ల‌డించారు‌.ఏదేమైనా క‌రోనా ఇలా కూడా మ‌నుషులపై దాడి చేయ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube