ఉల్లి ని దొంగతనం చేసి లైఫ్ సెట్ చేసుకుందామనుకున్న యువకులు… చివరికి…  

four people arrested for onion stolen, Onions Price news, Onions Stolen, Pune news, Crime news, 2.35 lakh rupees onions - Telugu 2.35 Lakh Rupees Onions, Crime News, Four People Arrested For Onion Stolen, Onions Price News, Onions Stolen, Pune News

మామూలుగా “ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదని” అప్పుడప్పుడు మన పెద్దలు సామెతలు చెబుతుంటారు.  అలాగే ఉల్లి మన నిజ జీవితంలో పలు ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ఇప్పటికే పలువురు వైద్యులు పలు అధ్యయనాల ద్వారా నిరూపించారు.

TeluguStop.com - Youth Tried To Steal Onions For Money

 అయితే మామూలు సమయంలో ఉల్లి ధరలు తక్కువగా ఉండటంతో సామాన్య ప్రజలు బాగానే ఉపయోగించే వారు. కానీ ప్రస్తుతం ఉల్లి ధరలు దాదాపుగా 80 రూపాయల నుంచి 100 రూపాయలు ఉండటంతో ఉల్లి కి గిరాకి బాగానే ఉంది.

 దీంతో కొందరు యువకులు ఓ వ్యక్తి దాచుకున్న ఉల్లిగడ్డలను దొంగలించి మార్కెట్లో విక్రయిస్తూ పోలీసులు పట్టుబడ్డ ఘటన పూణే పరిసర ప్రాంతంలో వెలుగు చూసింది.

TeluguStop.com - ఉల్లి ని దొంగతనం చేసి లైఫ్ సెట్ చేసుకుందామనుకున్న యువకులు… చివరికి…-General-Telugu-Telugu Tollywood Photo Image

వివరాల్లోకి వెళితే స్థానిక పట్టణ పరిసర ప్రాంతంలో ఓ రైతు ఉల్లి పంటను దగ్గరలో ఉన్నటువంటి గిడ్డంగులో దాచుకున్నాడు.

దీంతో ప్రస్తుతం ఉల్లి ధరలు బాగానే ఉండటంతో అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది గమనించిన కొందరు యువకులు రైతు దాచుకున్న ఉల్లిగడ్డలను దొంగలించి సొమ్ము చేసుకోవాలని పన్నాగం పన్నారు.

అయితే ఈ పన్నాగం లో భాగంగా గిడ్డంగి నుంచి ఉల్లిని దొంగలించి మార్కెట్లో అమ్మే ప్రయత్నం చేస్తున్నారు.దీంతో విషయం తెలుసుకున్న రైతు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి తనకు ఎలాగైనా న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను కోరాడు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణలో భాగంగా ఉల్లిగడ్డలను విక్రయిస్తున్న యువకులను అదుపులోకి తీసుకొని విచారించగా తామే గిడ్డంగి నుంచి ఉల్లిగడ్డలని దొంగలించినట్లు నేరం అంగీకరించారు. దీంతో ఉల్లిగడ్డలను దొంగలించి లైఫ్ సెట్ చేసుకోవాలనుకున్న యువకులు ప్రస్తుతం కటకటాల్లో ఊచలు లెక్క పెడుతున్నారు.

#FourPeople #2.35Lakh #Onions Stolen

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Youth Tried To Steal Onions For Money Related Telugu News,Photos/Pics,Images..