సెల్ఫీల కోసం యువత ఎన్ని లక్షలు ఖర్చు చేస్తున్నారో తెలుస్తే షాక్ అవుతారు..!       2018-06-15   23:24:50  IST  Raghu V

సెల్ ఫోన్ ఉంటే చాలు ఇల్లు,గుడి ,బడి,రోడ్డు..ఇలా ఎక్కడ నిలబడితే అక్కడ సెల్ఫీ దిగడమే..పక్కన ఏం జరుగుతుంది..పక్కనుండి ఎవరెళ్తున్నారు ఏవి పట్టించుకోకుండా లోకాన్నే మర్చిపోతున్నారు.చిన్నాపెద్దా తేడాలేకుండా ఫోన్ మాయలో ,ఫోటోల మాయలో మునిగిపోతున్నారు. ఆ సెల్ఫీ పిచ్చి ముదిరి కొన్ని లక్షలు పోగొట్టుకుంటున్నారంట కొంతమంది. అసలు కథ ఏంటో చూడండి.!

సెల్ఫీల కోసం లక్షలు ఖర్చు పెట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్న యువతీ యువకులతో తల్లిదండ్రుల గుండెల్లో ఇప్పుడు గుబుల మొదలైంది. ఢిల్లీకి చెందిన సాహిల్ కమ్రా తన ముక్కు, పెదాలకు అతగాడు రూ. 80 వేలతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. ఇకమీదట తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ యాంగిల్‌లో కావాలంటే ఆ యాంగిల్‌లో సెల్ఫీలు తీసుకోగలనని, ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసం వచ్చిందని సాహిల్ చెబుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో మనోడికి 500 మంది వరకు ఫాలోవర్లున్నారు మరి!

ఇక బాలీవుడ్ హీరోగా కంటే… దీపికా పడుకొనే బాయ్‌ఫ్రెండ్‌గానే బాగా పాపులర్ అయిన రణవీర్‌సింగ్ మంచాన పడ్ట సమయంలో ముంబైలోని ఓ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకుని ఆపరేషన్ థియేటర్ నుంచే ఓ సెల్ఫీ దిగి… అభిమానుల కోసం దాన్ని ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశాడు.

ఇతనొక్కడే కాదు, సెల్ఫీకోసం ఫేస్‌ షేపులు మార్చేసే వారు అమెరికాలో చాలామందే ఉన్నారు. రెనాల్డ్స్‌ను చూసి ఇన్‌స్పైర్‌ అయిపోయి ముఖాన్ని తీసుకెళ్లి డాక్టర్లకు అప్పగించేస్తున్నారు. ఆపరేషన్‌కు ముందు ఎలా ఉన్నారో, ఆ తర్వాత ఎలా మారిపోయారో ఫొటోలు తీసుకుని మరీ సోషల్‌ సైట్లలో పోస్టు చేసేస్తున్నారు.