ఇదేందయ్యా ఇది.. యూట్యూబ్ చూసి ఆయుధాలు కూడా తయారు చేయవచ్చా..?!

ప్రస్తుత రోజుల్లో యువతలో చాలా మార్పు వచ్చింది.ఎన్నెన్నో కొత్త ప్రయోగాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

 Youth Making Weapons By Watching Youtube Caught In Tamilnadu Details, Youth ,wea-TeluguStop.com

మరి ముఖ్యంగా యూట్యూబ్​ ఛానెళ్లు చూసి చాలామంది తమకి తెలియని కొత్త కొత్త విషయాలను యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా చూసి నేర్చుకుని వాటిని తయారు చేస్తున్నారు.మంచి నేర్చుకుంటే పర్వాలేదు కానీ ఇతరులకు చెడు చేసే వాటిని మాత్రం నేర్చుకుంటే చాలా ప్రమాదకరం అని ఈ యువకులు చేసిన పని చూస్తే అర్ధం అవుతుంది.

యూట్యూబ్ చూసి ఇద్దరు యువకులు ఏకంగా ఆయుదాల తయారీని మొదలుపెట్టారు.చివరాకరికి పోలీసులకు చేతులకు చిక్కి కటాకటాలపాలయ్యారు.

అసలు వివరాల్లోకి వెళితే.ఈ సంఘటన తమిళనాడులోని ఓమలూరు సమీపంలోని పులియంపట్టి వద్ద చోటు చేసుకుంది.ఆ ప్రాంతంలో స్థానిక పోలీసులు గత కొద్ది రోజుల క్రితం వాహన తనిఖీలు చేపట్టారు.అదే సమయంలో సేలం నుంచి ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై అటుగా అనుమానస్పదంగా కనిపించారు.

వారిపై అనుమానం వచ్చి పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.అయితే ఆ ఇద్దరు యువకులు ఒకదానికొకటి పొంతనలేని సమాధానాలివ్వడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది.

Telugu Knife, Omaluru, Pistol, Revolver, Salem, Sanjay Prathap, Tamilnadu, Youtu

ఈ క్రమంలో వారి వద్ద ఉన్న బ్యాగును సోదా చేయగా అందులో తుపాకీ, పెద్ద పిస్టల్, సగం తయారు చేసిన పెద్ద తుపాకీ, కత్తితో సహా మరికొన్ని మారణాయుధాలను చూసి పోలీసులు షాక్ అయ్యారు.ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేయగా వారు సేలం జిల్లా ఎరుమపాళయం ప్రాంతానికి చెందిన నవీన్ చక్రవర్తి, సంజయ్ ప్రతాప్​గా తెలిసింది.ఈ యువకులు ఇద్దరు యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ తుపాకులు, గ్రనేడ్‌లు, కత్తులు, మందుగుండు సామగ్రి ఎలా తయారుచేయాలో తెలుసుకుని వాటిని తయారు చేస్తున్నారని తేలింది.వెంటనే పోలీసులు వారి దగ్గర ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube