కుర్ర హీరో గట్టి ఆఫర్ కొట్టాడు..!

దశాబ్ధ కాలంగా హిట్ కోసం కిందా మీదా పడుతున్న హీరోలున్న ఈ టైంలో రావడం రావడమే హ్యాట్రిక్ హిట్స్ ఇండస్ట్రీని షేక్ చేసిన రాజ్ తరుణ్ కెరియర్ లో 5 సినిమాలు చేసి 4 హిట్స్ అందుకున్నాడు.అయితే మనోడికి ఈ హిట్ పొగరు తలకెక్కి కాస్త దర్శక నిర్మాతల దగ్గర నోరు జారుతున్నాడని ఓపెన్ టాక్.

 Youth Hero Hat-trick Offers-TeluguStop.com

అంతేకాదు ఆ అలవాటు వల్ల ముందు తనకు అనుకున్న పెద్ద సినిమాలు వేరే హీరోల ఎకౌంట్లో వెళ్లిపోతున్నాయి.ఇక రీసెంట్ గా ఈడోరకం ఆడోరకంతో సూపర్ హిట్ అందుకున్న రాజ్ ఆ సినిమా ప్రొడ్యూసర్ ఇచ్చిన ఆఫర్ కు ఫిదా అయ్యాడు.

ఏ.కె ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రాజ్ తరుణ్ మూడు సినిమాలు తీసేలా ఒప్పందం కుర్చుకున్నాడట నిర్మాత అనీల్ సుంకర.

ఈ మూడు సినిమాల రెమ్యునరేషన్ కూడా భారీగానే ఒకేసారి ముట్టచెప్పేలా అగ్రిమెంట్ చేసుకున్నారట.అంతేకాదు బోనస్ కింద రాజ్ తరుణ్ కు ఓ విల్లా కూడా ఇస్తున్నాడట.

మరి కుర్ర హీరోని అది కూడా క్రేజ్ లో ఉన్న హీరోకి గట్టి ఆఫర్ ఇచ్చి అనీల్ సుంకర ఏదో పెద్ద ప్లానే వేశాడని ఫిల్మ్ నగర్ టాక్.

వీరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమాను వంశీ కృష్ణ డైరెక్ట్ చేస్తాడట.

దొంగాట సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వంశీకృష్ణ రాజ్ తరుణ్ కు సూటయ్యే కథ రెడీ చేశాడట.ఇక రెండో సినిమాకు ఓ తమిళ దర్శకుడు పనిచేస్తాడని తెలుస్తుంది.

సో మొత్తానికి నోరు బాగాలేకున్నా టాలెంట్ తో రాజ్ తరుణ్ ఆఫర్లు కొట్టేస్తున్నాడు.మరి నోరు కూడా అదుపులో పెట్టుకుంటే ఇంకా మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

లేకుంటే ఈ ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం కష్టం.ఆ విషయం మనోడికి అర్ధమయ్యేలా ఎవరైనా చెబితే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube