పుష్ప పాటకి గర్బా డ్యాన్స్ తో అదరగొట్టిన యువకులు.... వీడియో వైరల్..

ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో కొన్ని నెలల క్రితం విడుదలైన పుష్ప సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటిసారిగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.

 Youth Dances To Pushpa Song Saami Saami In Garba Style Video Viral Details, Yout-TeluguStop.com

ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.ఎర్ర చందనం స్మగ్లింగ్ కథతో వచ్చిన ఈ సినిమా లో బన్నీ, స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో నటించి అభిమానులను మెప్పించాడు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకులనే కాదు, చాలామంది సెలబ్రిటీలు కూడా అభిమానులు అయ్యారు.ఈ లోని పుష్పరాజ్ సిగ్నెచర్ స్టెప్స్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిన విషయమే.

ఇక ఈ మూవీలోని పాటలు సైతం సోషల్ మీడియాను షేక్ చేశాయి.భాషతో సంబంధం లేకుండా మిలియన్ వ్యూస్‍తో దూసుకుపోయాయి.చిన్న, పెద్ద అనే తేడా లేకుండా పుష్ప పాటలకు స్టెప్పులేశారు.ఇటీవలే ఓ చిన్నారి సామి సామి పాటకు అద్బుతంగా డాన్స్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా గుజరాతీలోని కొందరు యువకులు సామి సామి పాటకు గర్బా స్టెప్పులేసి దుమ్ము లేపారు.దసరా సందర్భంగా గుజరాతీలో నవరాత్రి ఉత్సవాల్లో గర్బా చేస్తుంటారు.

ఇందులో భాగంగా కొందరు యువకులు సామి సామి పాటకు గర్బా డాన్స్ చేస్తూ హుక్ స్టెప్ వేస్తూ అదుర్స్ అనిపించుకున్నారు.

తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసిన రష్మిక క్రేజీ అంటూ పోస్టు చేసింది.అయితే రష్మిక సైతం గుడ్ బై ప్రమోషన్లలో భాగంగా మామ్స్ 3 ప్రోగ్రామ్‏లో పాల్గొన్న రష్మిక బాలీవుడ్ నటుడు గోవిందాతో కలిసి సామి సామి పాటకు స్టెప్పులేసింది.

ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా, త్వరలోనే రష్మిక సైతం షూటింగ్‏కు హాజరు కానుంది.రష్మిక మందన తెలుగులోనే కాకుండా హిందీ, తమిళంలో వరుస లతో బిజీగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube