మద్యం మత్తులో ఉన్న ఫ్రెండ్ దుస్తులు తొలగించి .. తన నగ్న చిత్రాలతో..చివరికి ఏమైందంటే...  

Youth Commits Suicide After Roommates Strip Him And Blackmail Him-palghar,rahul Mishra Suicide,roommates Strip Him ,నగ్న చిత్రాలతో,మద్యం మత్తులో

మద్యం తగిన మత్తులో పడుకున్న కుర్రాడి న్యూడ్ ఫోటోలు తీసి అతడిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టారు అతని ఫ్రెండ్స్. ఆ ఫొటోస్ బయటకి వెళ్లకుండా ఉండాలంటే తమకి డబ్బు ఇవ్వాలని తన ఫ్రెండ్స్ డిమాండ్ చేయడం తో మానసిక క్షోభ తట్టుకోలేక ఆ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య కి పాల్పడ్డాడు స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన ముంబై నగరంలోని పాల్ఘర్ వాంగావ్‌లో జరిగింది. ఓ టీనేజ్ కుర్రాడు, తనకు తెలిసిన మరో యువకుడితో కలిసి ముంబైలోని పాల్ఘర్ వాంగావ్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు..

మద్యం మత్తులో ఉన్న ఫ్రెండ్ దుస్తులు తొలగించి .. తన నగ్న చిత్రాలతో..చివరికి ఏమైందంటే...-Youth Commits Suicide After Roommates Strip Him Nude And Blackmail Him

ఇద్దరూ బోయిసార్‌లోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేసేవారు.

కొన్ని వారాల కిందట జీతం వచ్చిన రోజు రూమ్ మేట్స్ పార్టీ చేసుకున్నారు. మరో స్నేహితుడితో కలిసి అద్దె ఇంట్లోనే ఫుల్లుగా మద్యం సేవించారు.

అయితే ఫుల్లుగా తాగిన తర్వాత టీనేజర్ మత్తులో ఒళ్లు తెలియకుండా నిద్రపోయాడు. ఎంత పిలిచినా లేవకపోవడంతో రూమ్‌మేట్ బుర్రలో ఓ ఆలోచన వచ్చింది. వెంటనే కుర్రాడి ఒంటి మీద ఉన్న దుస్తులన్నీ తీసేశాడు.

న్యూడ్ ఫోటోలు తీశాడు. తర్వాతి రోజు వాటిని చూపించి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టాడు.తమకి అడిగిన డబ్బులు ఇవ్వకపోతే అతని నగ్న చిత్రాలు సోషల్ మీడియా లో పెడతామని బెదిరించారు.

మొదట్లో వాటిని పెద్దగా పట్టించుకోని ఆ యువకుడికి మెల్లగా మానసిక క్షోభ కి గురై వారు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేవాడు.రూమ్ అద్దె మొత్తం ఒక్కడే కట్టాల్సిందిగా, తన ఖర్చులు మొత్తం భరించాల్సిందిగా కుర్రాడిపై మానసిక ఒత్తిడి, ఆర్థిక ఒత్తిడి పెంచాడు. రూమ్‌మేట్ బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేకపోయిన టీనేజర్ గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు అతను రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా రూమ్‌మేట్ మొబైల్‌లో చెక్ చేయగా కుర్రాడి నగ్నచిత్రాలు కనిపించాయి.

ఫోటోలు డిలీట్ చేయాల్సిందిగా వేడుకుంటూ కుర్రాడు పంపిన మెసేజ్‌లు కూడా కనిపించాయి. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.