మూత్రం వాసన తేడా కొడుతోందా ? అయితే ఈ ప్రమాదాలతో జాగ్రత్త  

Your Urine Odor Should Come With These Health Problems-

ఎలాగైతే మూత్రం యొక్క రంగు మన ఆరోగ్య స్థితిని సూచిస్తుందో, అలాగే మూత్రం యొక్క వాసన కూడా మన ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని తెలుపుతుంది.మనం తీసుకునే డైట్ ని బట్టి మూత్రం వాసనలో అటు ఇటు కొన్ని మార్పులు జరుగుతాయి.

Your Urine Odor Should Come With These Health Problems---

అయితే అవి స్వల్ప మార్పులు అయి ఉండాలి.ఒక్కసారిగా ఊహించని వాసన అయి ఉండకూడదు.సింపుల్ గా చెప్పాలంటే భరించలేని వాసన ఉండకూడదు.అలా జరుగుతోంది అంటే మన శరీరం ఆరోగ్యంగా లేనట్టే.మరి మూత్రం వాసన మార్చగలిగే ఆ సమస్యలు, ప్రమాదాలు ఏంటో చూడండి.
* యూరినరి ట్రాక్ట్ ఇంఫెక్షన్.మూత్రం వాసన చెడుగా మారడానికి ఈ ఇంఫెక్షన్ ఒక కారణం.ఇలాంటి కండీషన్ లో కేవలం మూత్రం యొక్క రంగు, వాసన మారడమే కాదు, మూత్రంలో బాగా మంటగా ఉంటుంది.దురదగా కూడా ఉండొచ్చు.ఈ ఇంఫెక్షన్ యురెత్రా, బ్లాడర్ మరియు కిడ్నీలమీద చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.డాక్టర్ ని సంప్రదిచండి.మంచినీళ్ళు బాగా తాగడం అలవాటు చేసుకోండి.
* లివర్ వ్యాధులు వస్తే కూడా మూత్రం యొక్క వాసన తేడా కొడుతుంది.

ఈ కండీషన్ లో మూత్రం వాసన మరీ భయంకరంగా ఉంటుంది.ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మలీనాలు సరిగా శుభ్రం కాకపోవడం వలన.సాధారణంగా ఈ సమస్య వచ్చినప్పుడు వాంతులు కూడా అవుతాయి.కడుపులో నొప్పిగా కూడా ఉంటుంది.ఇలాంటప్పుడు ప్రొటీన్స్ ఎక్కువ తీసుకోని, మద్యం మానేసి, డాక్టర్ ని కలుస్తూ ఉండాలి

ఈ షుగర్ సమస్య తీసుకొచ్చే నష్టాల గురించి మీకు తెలియనిది కాదు.డైట్, డాక్టర్ .ఈ రెండు చాలా ముఖ్యం.
* ఇంటెస్టైనల్ ఫిస్టులా అనేది మరో ప్రధాన సమస్య.ఇందులో భయంకరమైన వాసన రావడంతో పాటు, మూత్రంలో బుడగలు కనిపిస్తాయి.కడుపులో నొప్పిగా ఉంటుంది.బ్లాడర్ కి ఇంటెస్ట్ టైన్స్ మధ్య సమన్వయం లోపించడం వలన ఈ సమస్య వస్తుంది.ఈ సమస్య కోసం కొలొస్టోమి అనే సర్జరీ అందుబాటులో ఉంది.డాక్టర్ ని అడిగి సర్జరీ మీద మరింత సమాచారం పొందండి.