Phone Hacking: మీ ఫోన్లో అనూహ్యంగా ఇలాంటి మార్పులు గ్రహించారా? హ్యాక్ అయినట్లే ఇక!

రానురాను పెరిగిపోతున్న టెక్నాలజీ మనిషికి మేలుతో పాటు కీడు కూడా చేస్తుంది.స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిన తరువాత ప్రజలు చాలా సులభంగా వారి పనులను మొబైల్ ఫోన్ ద్వారానే ఆన్లైన్లో నిర్వహించడానికి అలవాటు పడ్డారు.

 Your Phone Is Hakced If You Observe These Unexpected Changes In Your Mobile Deta-TeluguStop.com

మంచి దగ్గరే చెడు దాగివుంటుంది అన్న విషయం తెలుసుకదా.ఇక ఇదే విషయాన్ని కొందరు కేటుగాళ్లు వారికి అనుకూలంగా మలుచుకుంటున్నారు.

అవును, కొందరు హ్యాకర్లు, మొబైల్ ఫోన్లను హ్యాక్ చేయడం ద్వారా ఎంతో విలువైన పర్సనల్ డేటాను తస్కరిస్తున్నారు.తద్వారా అనేకరకాల అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

ఇలాంటి పరిస్థితులలో మీ ఫోన్లో అటువంటి సమస్య వుందా లేదో అనే విషయం తెలుసుకోవడానికి మీ ఫోన్ లో ఈ ఎటువంటి గుర్తులు కనిపిస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉందో ఇపుడు తెలుసుకోండి.మీ స్మార్ట్ ఫోన్ గాని హ్యాక్ కి గురైనట్లైతే మీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ అసాధారణంగా ఉంటుంది.

అంటే, చాలా త్వరగా మీ ఫోన్ బ్యాటరీ అనేది ఛార్జ్ అయిపోతుంది.అలాగే, మీరు వాడకుండానే మీ డేటా పూర్తిగా అయిపోతుంది.మరీ ముఖ్యంగా, వేగంగా పనిచేసే మీ ఫోన్ సడెన్ గా స్పీడ్ పడిపోతుంది.

Telugu Battery, Hack, Phone, Apps Ret, Smart Phone, Ups-Latest News - Telugu

అలాగే ఫోన్ లో రన్నింగ్ లో ఉన్న యాప్స్ క్లోజ్ అవ్వడం, లేదంటే ఫోన్ దానంతట అదే Restart అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తూ వుంటాయి.ఇటివంటి లక్షణాలు మీకు అనూహ్యంగా ఎదురైతే మీ ఫోన్ హ్యాక్ అయినట్లుగా మీరు భావించవచ్చు.అయితే, ఈ లక్షణాలను చాలా కాలంగా వాడుతున్న పాత మొబైల్ లలో వస్తే అది సాధారణ సమస్యగానే పరిగణించవచ్చు.

అంతేకాని మీరు కొత్తగా తీసుకున్న స్మార్ట్ ఫోన్లలో మీరు ఈ రకమైన సమస్యలను గుర్తించినట్లయితే, మీ ఫోన్ హ్యాక్ అయినట్లుగా నిర్ధారణకు వచ్చి తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube