2018 లో న్యూమరాలజీ ప్రకారం మీ అదృష్టం ఎలా ఉంటుందో తెలుసా?  

Your Date Of Birth & Number As Per Numerology-

కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే సాధారణంగా అందరు కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో అని ఆలోచనలో పడతారు.దాని గురించి తెలుసుకోవాలని అనుకుంటారు.2018 వ సంవత్సరం యూనివర్సల్ సంవత్సరం.దీని సంఖ్య శక్తీ 11.ఈ 11 సంఖ్యను అంకెలకు గురువుగా భావిస్తారు.అంతేకాక ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది.సంఖ్య ప్రకారం మీ అదృష్టం ఎలా ఉందో తెలుసుకుందాం.

అదృష్ట సంఖ్య1
ఈ సంవత్సరం వీరి జీవితం బాగుంటుంది.గతంలో ఉన్న ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి.వీరు గమ్యాన్ని చేరుకోవటానికి కొత్త మార్గాన్ని ఎంచుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.

Your Date Of Birth & Number As Per Numerology- Telugu Devotional Bhakthi(తెలుగు భక్తి ) Your Date Of Birth & Number As Per Numerology---

అదృష్ట సంఖ్య 2
ఈ సంఖ్య వారికీ కెరీర్ చాలా అనుకూలంగా ఉండి వారు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.అయితే వ్యక్తిగత విషయాలపై కొంచెం జాగ్రత్త వహించాలి.ఏ మాత్రం చిన్న తప్పు చేసిన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అదృష్ట సంఖ్య 3
ఈ సంవత్సరంలో వీరికి విదేశీ ప్రయాణాలు ఉంటాయి.

వీరి జీవితంలో కొత్త అనుభవాలు,ఎనర్జీ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.వీరు ఏ పని చేసిన వెనక్కి తిరిగి చూసుకొనే అవకాశం ఉండదు.

కొన్ని మార్పుల కారణంగా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి.


అదృష్ట సంఖ్య 4
వీరు కొన్ని విషయాల్లో రాజీ పడాలి.

ఈ సంవత్సరం వీరికి మంచి జరగకపోయినా చెడు మాత్రం జరగదు.వీరు సొంతంగా సంస్థను స్థాపిస్తారు.ఈ క్రమంలో కొన్ని ఆటంకాలు ఎదురు అయినా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు.

అదృష్ట సంఖ్య 5
ఈ సంవత్సరం గెలుపు ఓటములు సమానంగా ఉండి మొత్తం మీద తటస్థంగా ఉంటుంది.

వీరు వచ్చిన అవకాశాలను అంది పుచ్చుకొని ముందుకు సాగుతారు.అయితే వీరు కొంచెం తెలివిగా ఆలోచించ వలసిన అవసరం ఉంది.

అదృష్ట సంఖ్య 6
వీరు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ ఉంటారు.ప్రేమ, వివాహం, వృత్తి, ఆరోగ్య పరంగా బలంగా ఉంటారు.రిస్క్ తీసుకోవటానికి ప్రయత్నం చేస్తారు.అయితే దేనిని పట్టించుకోకుండా సహనంతో పనిచేయాలి.

అదృష్ట సంఖ్య 7
వీరికి సంబంధం,ప్రేమ వ్యవహారాలలో కొన్ని క్లిష్టమైన సమస్యలు ఎదురు అవుతాయి.ఆ సమయంలో కృంగిపోకుండా దైర్యంగా ముందడుగు వేయాలి.ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ఆందోళనలను తగ్గించుకుంటారు.

అదృష్ట సంఖ్య 8
వీరు చేసే పనిలో ఎక్కువగా భావోద్వేగాలు ఉంటాయి.

వీరు నిర్ణయాలను తీసుకోవటంలో ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు.అనేక అవకాశాలు వచ్చిన ఎంపిక విషయంలో మాత్రం ఆచి తూచి అడుగు వేయాలి.

అదృష్ట సంఖ్య 9
వీరిలో ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉంటుంది.వీరు పైకి ఎదగాలంటే గట్టి ప్రయత్నాలను పట్టు విడవకుండా చేయాలి.

ఉద్యోగంలో మార్పులు ఉంటే వాయిదా వేసుకోవటం ముఖ్యం.ఆరోగ్య పరంగా కొంచెం జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.

DEVOTIONAL