బౌద్ధ దేవాలయంలో శృంగార లీలలు... అతి చేసిన ఓ జంట

ఏ మతానికి చెందిన వారైన వారికి చెందిన దైవ మందిరాలని అత్యంత పవిత్రంగా భావిస్తారు.అలాంటి ప్రదేశాలలో చిన్న చిన్న పొరపాట్లు జరిగిన కూడా ఆయా మతాలకి చెందిన వారి మనోభావాలు దెబ్బ తింటూ ఉంటాయి.

 Youple Romance Video In Buddhist Temploung-TeluguStop.com

అయితే విదేశీయులు మాత్రం ఇలాంటివి అస్సలు లెక్కచేయరు.వారి దేశానికి చెందిన జాతీయ జెండాలని కూడా లోయర్ డ్రెస్సులుగా వాడుతూ ఉంటారు.

అలాగే నేప్ కిన్స్ గా కూడా వాడేస్తూ ఉంటారు.అదే సమయంలో దేవాలయాలు, ప్రార్ధనా స్థలాలలో శ్రుతి మించి ప్రవర్తించడం, శరీరం కనిపించే విధంగా వస్త్రధారణ చేసుకోవడం సర్వ సాధారణం.

అయితే కొంత మంది మరింత శృతి మించి ప్రవర్తిస్తూ ఉంటారు.

మలేసియాలోని ఓ బుద్దిస్ట్ దేవాలయంలో ఓ జంట శృంగారం చేసి ఆ వీడియోని అడల్ట్ వెబ్ సైట్ లో పోస్ట్ చేశారు.

ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో దాని గురించి అందరికి తెలిసింది.అసలు విషయంలోకి వెళ్తే మలేషియాలోని బగాన్ పట్టణంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బౌద్ధ మందిరం ఉంది.

దీనికి హెరిటేజ్ భవనంగా యూనెస్కో గుర్తింపునిచ్చింది.రోజుకు కొన్ని వందల మంది ఈ ప్రదేశాన్ని సందర్శిస్తుంటారు.అయితే ఓ అడల్ట్ వెబ్ సైట్‌లో బయటపడ్డ వీడియో ఈ ప్రదేశాన్ని అపవిత్రం చేసింది.23 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు భార్యభార్తలు ఈ బౌద్ధ క్షేత్రంలో శృంగార వీడియో షూట్ చేశారు.12 నిమిషాల పొడవు కలిగిన ఈ వీడియోను ఓ అడల్ట్ సైట్‌లో అప్‌లోడ్ చేశారు.వారిద్దరు ఇటలీకి చెందిన వారని సమాచారం.

అయితే ఈ వీడియో వైరల్ కావడంతో ఈ చర్యకి పాల్పడిన జంటపై బుద్దిస్ట్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమ మనోభావాలు కించ పరిచే విధంగా తమ పవిత్ర దేవాలయాన్ని అపవిత్రం చేసిన ఆ జంటపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube