రీల్ సీన్ ను రియల్ గా చేసి కటకటాల వెనక్కి వెళ్ళిన యువకులు.. !

సినిమా అనేది మనిషి నిజజీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అప్పుడప్పుడు జరిగే సంఘటనలను చూస్తే అర్ధం అవుతుంది.ఈ సినిమాలను చూసి అందులో మంచిని గ్రహించిన వారు మంచి పనులు చేస్తూ ఆదర్శంగా ఉంటుంటే, ఇందులో ఉన్న చెడును గ్రహించిన వారు చెడ్దపనులు చేస్తూ సమాజానికి చీడ పురుగుల్లా మారుతున్నారు.

 Youngsters Who Made The Reel Scene Real And Went To Jail-TeluguStop.com

ఇక సినిమా అనేది ఓ మూడు గంటల పాటు మానసిక ఉల్లాసాన్ని అందించే వినోదంగా మాత్రమే చూడాలి కానీ తెరమీద క్యారెక్టర్లు చేసినట్లుగా నిజ జీవితంలో చేస్తే మాత్రం నవ్వులపాలు అవ్వడమే కాదు.జైలుపాలు కూడా అవ్వాల్సి వస్తుంది.

ఇకపోతే తమిళనాడు తిరువళ్లూరులో నలుగురు యువకులు సినిమాలో రౌడీలుగా అవకాశం పొందాలని భావించి రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులను అడ్డగించి కత్తులతో విచక్షణ రహితంగా నరికి బీభత్సం సృష్టించారు.అనంతరం కలియనూర్‌ గ్రామానికి వెళ్లి అక్కడ కత్తులతో హల్‌చల్‌ సృష్టించారు.

 Youngsters Who Made The Reel Scene Real And Went To Jail-రీల్ సీన్ ను రియల్ గా చేసి కటకటాల వెనక్కి వెళ్ళిన యువకులు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ తతంగం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను ఆసుపత్రికి తరలించారు.కాగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా సినిమాల్లో రౌడీలుగా రాణించాలనే ఆశతో ఇలా చేశామని చెప్పారట.

ఇక సినిమా పిచ్చితో ఎదుటి వారి ప్రాణాలతో చెలగాటమాడిన ఆ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారట.

#Jail #Youngsters #Real Action #Reel Scene #Tamil Nadu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు