వీడియో : ముద్దులకు అడ్డాలుగా మారిన హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌ లిఫ్ట్‌లు... సీసీ కెమెరాకు చిక్కిన లిప్‌ లాక్‌లు  

ఒకప్పుడు ఇందిరా పార్క్‌ ప్రేమికులకు అడ్డాగా ఉండేది. కాని ఇప్పుడు హైదరాబాద్‌లో లవర్స్‌ ఎక్కువ అయ్యారు. ఇందిరా పార్క్‌ సరిపోవడం లేదేమో, ఎక్కడ పడితే అక్కడ ప్రేమించేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని చోట్ల సిగ్గు మరచి ముద్దులు పెట్టేసుకుంటున్నారు. హైదరాబాద్‌కు మణిహారంగా నిలిచి, హైదరాబాద్‌ ప్రజల ట్రాఫిక్‌ కష్టాలను తీర్చేందుకు మొదలైన మెట్రో ట్రాఫిక్‌ కష్టాలను తీర్చిందో లేదో తెలియదు కాని, లవర్స్‌కు మాత్రం మంచి అడ్డాగా మారింది.

మెట్రోలో అధిక టికెట్టు రేట్లు ఉంటున్న కారణంగా ఎక్కువ శాతం మంది వాటిని ఎక్కేందుకు ఆసక్తి చూపడం లేదు. దాంతో స్టేషన్స్‌ ఎక్కువ శాతం వెల వెల పోతున్నాయి. ఉదయం సాయంత్రం సమయాల్లో మినహా ఎక్కువ శాతం రైల్వే స్టేషన్స్‌ ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఆ సమయంలో సెక్యూరిటీ అధికారులు కూడా చూసి చూడనట్లుగా ఉంటున్న కారణంగా ప్రేమికులు రెచ్చి పోతున్నారు. మాట్లాడుకునేందుకు వచ్చే వారు ఎంతో మంది ఉంటున్నారు. ఇక లిఫ్ట్‌లో అటు ఇటు తిరుగుతూ ముద్దులు పెట్టుకునే వారు ఈమద్య కాలంలో మరీ ఎక్కువ అయ్యారు.

Youngsters Caught Love Making In Hyderabad Metro Lifts-Hyderabad Lifts Love Birds

Youngsters Caught Love Making In Hyderabad Metro Lifts

మెట్రో అధికారులకు చిరాకు తెప్పిస్తున్నారు. లిఫ్ట్‌లో సీసీ కెమెరాలు ఉన్న విషయం తెలియక ముద్దులు లవర్స్‌ ముద్దులు పెట్టుకుంటూ వస్తున్నారు. సరే ఒకరు ఇద్దరిని ఏం చేస్తాంలే అనుకుంటే ప్రతి రోజు లిఫ్ట్‌లో ఇదే పని అయ్యింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో పుటేజ్‌ను లీక్‌ చేసినట్లుగా ఉన్నారు. ఇప్పుడైనా లిఫ్ట్‌లో ముద్దులు ఆపేస్తారనే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌లో మాత్రమే ఉండే సీసీ పుటేజ్‌ బయటకు వచ్చింది.

ఈ ఫుటేజ్‌లో విచిత్రమైన విషయం ఏంటంటే ఎక్కువ శాతం అమ్మాయిలు బలవంతంగా అబ్బాయిలకు ముద్దులు పెట్టడం. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో అమ్మాయి ఫేస్‌ను కొందరు బ్లర్‌ చేసి పోస్ట్‌ చేస్తుంటే, మరి కొందరు మాత్రం ఉన్నది ఉన్నట్లుగా రివీల్‌ చేస్తున్నారు. సీసీ కెమెరా బయటకు కనిపించకుండా ఉండటం వల్ల ప్రేమికులు ముద్దులు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కెమెరాలు ఉన్నాయని తెలిసింది కనుక ఇకపై లిఫ్ట్‌ల్లో ముద్దులకు నో ఛాన్స్‌ అంటారేమో చూడాలి.