పట్టాలపై పడిపోయిన ప్రయాణికుడు,ఇంతలో హీరోలా

చైనా లో ఒక యువకుడు సకాలంలో స్పందించి చేసిన అద్భుతమైన పనికి ఒక్కసారిగా ఆ యువకుడు హీరో గా మారిపోయాడు.మన దైనందిన జీవితంలో చాలానే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి.

 Youngman Savespassenger From The Traintracks-TeluguStop.com

అయితే పరిస్థితులకు అనుగుణంగా సకాలంలో స్పందించి ఇతరులకు సాయం అందించినప్పుడు వారు తప్పకుండా హీరో లుగా నిలిచిపోతారు.దీనికి ప్రధాన ఉదాహరణ చైనా లో చోటుచేసుకున్న ఈ తాజాగా ఉదంతం.

ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ వీడియో హల్ చల్ చేస్తుంది.అతడి హీరోయిజం కి నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే ఒక ప్రయాణికుడు రైలు వస్తున్న సమయంలో రైలు పట్టాలు దాటాలని అంత దూరంలో ఉండగానే పట్టాలపై దూకాడు.అయితే అనుకోకుండా అతడు పట్టాలపైనే పడిపోవడం తో ఏమి చేయాలో అర్ధం కాలేదు.

అయితే మరోపక్క రైలు కూడా దూసుకొస్తుండడం తో అప్పుడే ఒక యువకుడు ప్లాట్ ఫామ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి పట్టాలపై దూకి క్షణాల్లో అతడిని పక్కకు లాగేశాడు.దీనితో అతడి ప్రాణాల తో బయటపడగలిగాడు.

ఆ యువకుడు స్పందించిన తీరు తో నెటిజన్లు సైతం ఫిదా అయిపోతున్నారు.

Telugu Passengertrain, Telugu Ups, Soicial, Young Passenger-

  నిజంగా అతడు రియల్ హీరో అంటూ తెగ కామెంట్ చేస్తున్నారు.ఆ యువకుడు సకాలంలో స్పందించి మెరుపు వేగం తో ఆ ప్రయాణికుడిని కాపాడిన తీరుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడం తో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube