పట్టాలపై పడిపోయిన ప్రయాణికుడు,ఇంతలో హీరోలా  

Young Man Saves Passenger From The Train Tracks-telugu Viral News Updates,viral In Soicial Media,young Man Saves Passenger

చైనా లో ఒక యువకుడు సకాలంలో స్పందించి చేసిన అద్భుతమైన పనికి ఒక్కసారిగా ఆ యువకుడు హీరో గా మారిపోయాడు.మన దైనందిన జీవితంలో చాలానే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి.అయితే పరిస్థితులకు అనుగుణంగా సకాలంలో స్పందించి ఇతరులకు సాయం అందించినప్పుడు వారు తప్పకుండా హీరో లుగా నిలిచిపోతారు.

Young Man Saves Passenger From The Train Tracks-telugu Viral News Updates,viral In Soicial Media,young Man Saves Passenger-Young Man Saves Passenger From The Train Tracks-Telugu Viral News Updates Viral In Soicial Media

దీనికి ప్రధాన ఉదాహరణ చైనా లో చోటుచేసుకున్న ఈ తాజాగా ఉదంతం.ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ వీడియో హల్ చల్ చేస్తుంది.అతడి హీరోయిజం కి నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు.ఇంతకీ విషయం ఏమిటంటే ఒక ప్రయాణికుడు రైలు వస్తున్న సమయంలో రైలు పట్టాలు దాటాలని అంత దూరంలో ఉండగానే పట్టాలపై దూకాడు.అయితే అనుకోకుండా అతడు పట్టాలపైనే పడిపోవడం తో ఏమి చేయాలో అర్ధం కాలేదు.

Young Man Saves Passenger From The Train Tracks-telugu Viral News Updates,viral In Soicial Media,young Man Saves Passenger-Young Man Saves Passenger From The Train Tracks-Telugu Viral News Updates Viral In Soicial Media

అయితే మరోపక్క రైలు కూడా దూసుకొస్తుండడం తో అప్పుడే ఒక యువకుడు ప్లాట్ ఫామ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి పట్టాలపై దూకి క్షణాల్లో అతడిని పక్కకు లాగేశాడు.దీనితో అతడి ప్రాణాల తో బయటపడగలిగాడు.ఆ యువకుడు స్పందించిన తీరు తో నెటిజన్లు సైతం ఫిదా అయిపోతున్నారు.

నిజంగా అతడు రియల్ హీరో అంటూ తెగ కామెంట్ చేస్తున్నారు.ఆ యువకుడు సకాలంలో స్పందించి మెరుపు వేగం తో ఆ ప్రయాణికుడిని కాపాడిన తీరుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడం తో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.