ఇస్మార్ట్ శంకర్ కి కాపీ మరక! తుడుచుకునే పనిలో పూరీ జగన్నాథ్  

ఇస్మార్ట్ శంకర్ కథ తనదే అని కంప్లైంట్ చేసిన యువ రచయిత. .

Young Writer Complaint On Ismart Shankar Movie Team-

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్.ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుంది.తాజాగా టీం మొత్తం సినిమాకి గుమ్మడికాయ కొట్టేసారు.ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.అయితే ఇందులో పూరీ మార్క్ కనిపించిన ఎందుకనో సినిమాలో క్లారిటీ లేదు అనే మాట వినిపిస్తుంది.

Young Writer Complaint On Ismart Shankar Movie Team--Young Writer Complaint On Ismart Shankar Movie Team-

పక్కా హైదరాబాదీ స్టైల్ లో ఈ సినిమాని దర్శకుడు పూరీ తెరకెక్కించాడు.ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా క్రిమినల్ అనే ఓ హాలీవుడ్ మూవీ కాపీ అనే టాక్ వినిపిస్తుంది.హాలీవుడ్ మూవీ ఎలిమెంట్స్ ని పూరీ మార్క్ మిక్స్ చేసి తెలుగు ప్రేక్షకులకి అందించే ప్రయత్నం చేస్తున్నారని టాక్.

Young Writer Complaint On Ismart Shankar Movie Team--Young Writer Complaint On Ismart Shankar Movie Team-

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో ఓ యువ రచయిత ఇస్మార్ట్ శంకర్ తనది అంటూ రచయిత సంఘం ముందు పంచాయితీ పెట్టాడు.ఈ కథని తాను గతంలో రామ్ పెదనాన్న నిర్మాత స్రవంతి రవి కిషోర్ కి చెప్పానని, ఇప్పుడు అదే కథతో పూరీ ఇస్మార్ట్ శంకర్ సినిమా తెరకెక్కుతుంది అని ఫిర్యాదు చేసారు.

ఇక తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ విషయం మీద క్లారిటీ వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తుంది.మరి ఇప్పుడు పూరీ జగన్నాథ్ ఈ కాపీ కథ అనే నిందని ఎలా చేరుపుకుంటాడు అనేది వేచి చూడాలి.