9 నెలల పసిపిల్లోడిని అపహరించిన 19 ఏళ్ల యువతి..! ఎందుకో తెలుస్తే ఆశ్చర్యపోతారు!  

Young Women Stolen 9 Months Baby Boy-

రోడ్డు పక్కగా ఫుట్‌పాత్‌పై తల్లితో పాటు ఉన్న 9 నెలల బాలుడిని అపహరించింది ఓ 19 ఏళ్ల యువతి. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో మాయమైన ఈ చిన్నారిని పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ఆ యువతితో సహా కనుగొన్నారు. తరువాత ఆ చిన్నారిని తల్లి దగ్గరకు చేర్చారు..

9 నెలల పసిపిల్లోడిని అపహరించిన 19 ఏళ్ల యువతి..! ఎందుకో తెలుస్తే ఆశ్చర్యపోతారు!-Young Women Stolen 9 Months Baby Boy

అయితే ఆ యువతి పిల్లవాడిని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఆ చిన్నారిని అపహరించింది.

ఈ ఉదంతంలో నిందితురాలిని సప్నా(19)గా పోలీసులు గుర్తించారు. ఆ యవతితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఇద్దరిలో ఒకరు అజీత్ సింగ్(45). అజీత్‌తసింగ్ భార్య మృతి చెందింది.

దీంతో ఆ యువతి ఈ చిన్నారితో పాటు అజిత్‌సింగ్‌తో కలిసివుండాలని నిర్ణయించుకుంది.ఆ ఉద్దేశంతోనే పిల్లోడిని అపహరించింది.

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూజా అనే మహిళ తన కొడుకు అదృశ్యమయ్యాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ నేపధ్యంలోనే పోలీసులు నిందితురాలిని పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో పట్టుకున్నారు.