వైరల్ వీడియో: పట్టపగలే యువతిపై కాల్పులు..!  

viral video young woman shot in day time viral video, day time, women, djp, letter, kidnap, gun shoot - Telugu Day Time, Djp, Gun Shoot, Kidnap, Letter, Viral Video, Viral Video Young Woman Shot In Day Time, Women

తాజాగా దేశ రాజధాని ఢిల్లీకి దగ్గర లో దారుణ సంఘటన చోటు చేసుకుంది.ఓ ఉన్మాది పట్టపగలు ఓ యువతిపై కాల్పులకు తెగబడ్డాడు.

TeluguStop.com - Young Woman Shot In Day Time

పట్టపగలే తుపాకీ తీసుకొని యువతి పై దాడికి పాల్పడడం ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది.ఈ సంఘటన హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ లో చోటుచేసుకుంది.

ఈ సంఘటనలో బుల్లెట్ తగలడంతో బాధితురాలు అక్కడికక్కడే మరణించింది.దీంతో ఫరీదాబాద్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

TeluguStop.com - వైరల్ వీడియో: పట్టపగలే యువతిపై కాల్పులు..-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ సంఘటనకు సంబంధించి అదే ప్రాంతంలో ఉన్న సిసి ఫుటేజ్ లో దృశ్యాలు రికార్డు అయ్యాయి.

కాకపోతే ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు ఫరీదాబాద్ కు చెందిన నిఖిత తోమర్ అనే అమ్మాయి సోమవారం రోజున పరీక్ష రాసి కళాశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా అదే క్రమంలో ఓ గుర్తుతెలియని కారులో నుంచి వ్యక్తి మొదట ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేశాడు.

అయితే ఆ సమయంలో ఆమె ప్రతిఘటించడంతో దీంతో తన వెంట తెచ్చుకున్న తుపాకీతో ఆ అమ్మాయి పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. నిఖిత అక్కడికక్కడే కుప్పకూలిపోయిన తర్వాత ఆసుపత్రికి తరలించే లోపే ఆవిడ మరణించింది.

సీసీ ఫుటేజీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను ఆధారంగా చేసుకుని పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సంఘటనకు సంబంధించి ప్రస్తుత ప్రధాన నిందితుడు తౌసిప్ ను పోలీసులు అరెస్టు చేశారు.

ఇకపోతే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఈ విషయంపై బాధితురాలి తల్లి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆవేదన వ్యక్తం చేసింది.

వారిని ఎన్ కౌంటర్ చేసే వరకు తన కుమార్తె అంత్యక్రియలను జరగనివ్వనని ఆవిడ తెలిపారు.ఈ సంఘటనను సుమోటోగా పరిగణలోకి తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ హర్యానా డిజిపి కి లేఖ రాశారు.

#Letter #ViralVideo #Kidnap #Gun Shoot #Women

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Young Woman Shot In Day Time Related Telugu News,Photos/Pics,Images..