యువతి గర్భధారణ.. రూ.60 వేలకు పాప అమ్మకం..!  

bhuvanagiri woman sold child, women, rape, pregnant, selling baby, police, bhuvanagiri - Telugu Bhuvanagiri, Bhuvanagiri Woman Sold Child, Police, Pregnant, Rape, Women

దేశంలో ఎదో ఒక్క ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.వారి కామవాంఛ తీర్చుకోవడం కోసం పశువుల మారుతున్నారు.

TeluguStop.com - Bhuvanagiri Young Woman Sold Baby

కామాంధుల వికృత చేష్టలకు అమ్మాయిల నిండు జీవితాలు బలైతున్నాయి.చిన్న పిల్లల నుండి పండు ముసలి వరకు అందరిని లైంగిక వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు.

దేశంలో మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలను తీసుకొచ్చినప్పడికి మహిళలపై అఘాయిత్యాలను అరికట్టలేకపోతున్నాయి.తాజాగా కామాంధుడి చేతి బలైపోయిన ఓ యువతీ జీవితం అగోచరంగా మారింది.

TeluguStop.com - యువతి గర్భధారణ.. రూ.60 వేలకు పాప అమ్మకం..-General-Telugu-Telugu Tollywood Photo Image

పదిరోజుల పేగు బంధాన్ని అమ్మకాన్ని పెట్టింది.ఈ దారుణ ఘటన భువనగిరి చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.భువనగిరి ఏరియా ఆస్పత్రిలో ఈ నెల 12 ఓ యువతి పసికందుకు జన్మనిచ్చింది.అయితే ఇందులో ఎం న్యూస్ ఉంది అనుకుంటున్నారా.అయితే అక్కడ బిడ్డకు జన్మనిచ్చిన యువతికి ఇంకా పెళ్లి కాలేదు.

ఆమె తన తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌ ప్రాంతంలో నివాసం ఉంటుంది.అయితే అక్కడ నివసించే సమయంలో యువతిపై అఘాయిత్యం జరిగింది.

దీనిపై బాధితురాలు పోలీసులు ఫిర్యాదు చేశారు.గర్భం దాల్చిన యువతి ఓ పసిపాపకు జన్మనిచ్చింది.

పదిరోజుల తర్వాత పాపను అమ్ముకున్నారు.ఈ కేసు విచారణలో ఉండటంతో పోలీసులు పుట్టిన బిడ్డను డీఎన్ఏ టెస్ట్ కోసం తీసుకరావాలని చెప్పారు.

అయితే బాధితురాలు తల్లిదండ్రులు పాప పుట్టినా వెంటనే చనిపోయిందని తెలిపారు.పోలీసులకు అనుమానం వచ్చి గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటికి వచ్చింది.10 రోజులకు పసికందును రూ.60 వేలకు భువనగిరి శివారులోని ఎల్లమ్మ గుడి దగ్గర విక్రయించారని తెలిపారు.ఈ ఘటనపై మరో కేసు నమోదు చేసిన పోలీసులు.పాపను చైల్డ్ కేర్ సెంటర్ తరలించారు.

#Police #Pregnant #Women #Rape #Bhuvanagiri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bhuvanagiri Young Woman Sold Baby Related Telugu News,Photos/Pics,Images..