నడిరోడ్డుపై యువతి హల్చల్.. ఇలా కొడుతుందేంటి..?

ఇంటర్‌నెట్‌లో ఒక వీడియో కొంచెం కాంట్రవర్సీగా ఉంటే చాలు.దానిని యూజర్లు చాలా వైరల్ చేస్తుంటారు.

 Young Woman Hustle And Bustle On The Road What Is This Beating-TeluguStop.com

అందులో ఇంకా ఏదైనా దాడికి సంబంధించిన వీడియో లేదా బూతు పురాణాలకు సంబంధించిన వీడియో అయితే చాలు, అది ట్రెండింగ్‌లోకి వెళ్తుంది.అయితే ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వివరాల్లోకి వెళితే ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో ఓ యువతి ఒక యువకుడిని కొట్టిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.లక్నో నగరంలోని అవధ్ అనే ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది.

 Young Woman Hustle And Bustle On The Road What Is This Beating-నడిరోడ్డుపై యువతి హల్చల్.. ఇలా కొడుతుందేంటి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఓ యువకుడిని నడి రోడ్డు మీద ఒక యువతి చితకబాదింది.అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌తో సహా ప్రజలు అందరూ దాడిని చూస్తున్నారు కానీ ఎవరూ ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.

అయితే ఒక వ్యక్తి అడ్డు రాగా అతని ఫోన్ పగలగొట్టింది మరియు మరొక వ్యక్తి కాలర్ కూడా పట్టుకొని కొట్టసాగింది.అదే సమయంలో అవధ్ ప్రాంతంలోని రోడ్డు మీద చాలా సేపు ట్రాఫిక్ ఏర్పడి వాహనాలు బారుల తీరాయి.

అక్కడ ఉన్న చాలా మంది కూడా ‘అసలు ఈ అమ్మాయికి బుద్ది ఏమైనా ఉందా?’ అని తిడుతున్నా కూడా, సదరు అమ్మాయ అదేం పట్టించుకోకుండా యువకుడిని కొడుతూనే ఉంది.అయితే, ఆమె వాహనాన్ని సదరు యువకుడు ఢీ కొనడంతోనే కొట్టినట్లు యువతి మాట్లాడుతుండగా తెలిసింది.

దీనికి సంబంధించిన వీడియోను మేఘ్ అప్‌డేట్స్ అనే ట్విటర్ పేజీలో అప్‌లోడ్ అవ్వగా, #ArrestLucknowGirl అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ట్విట్టర్ ట్రెండింగ్‌లో టాప్‌లో ఉండటం విశేషం.ఈ వీడియోకు సంబంధించి లక్నో పోలీసులను కొందరు మీడియా ప్రతినిధులు సంప్రదించగా, ఎటువంటి వివరాలు చెప్పలేదు.కొసమెరుపు ఏమిటంటే, ఈ దాడి ఘటనలో యువకుడి పైనే పోలీసులు కేసు నమోదు చేశారని వార్తలు వచ్చాయి.

#Avdh #Twitter #Lacknow #Bustle #Uttar Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు