ప్రస్తుత కాలంలో కొందరు ప్రేమ పేరుతో చేసే టువంటి ఆకృత్యాలు ఇతరుల జీవితాల్లో విషాదాన్ని నింపుతున్నాయి.తాజాగా ప్రేమ వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలో ఉన్నటువంటి పోరుమామిళ్ల మండలంలో గ్రామానికి చెందినటువంటి శాంతి ప్రియ యువతి స్థానికంగా ఉన్నటువంటి ఓ కాలేజీలో లో టీచర్ ట్రైనింగ్ తీసుకుంటోంది.ఇందులో భాగంగా తరచూ కాలేజీకి గ్రామం నుంచి రోజూ వచ్చి వెళుతూ ఉండేది.
ఈ క్రమంలో ఓబులేసు అనే వ్యక్తి యువతిని ప్రేమ పేరుతో వేధించిన సాగాడు.తనకు ఇష్టం లేదని శాంతిప్రియ ఎన్ని మార్లు చెప్పినప్పటికీ వినకుండా ఆమెని వేధిస్తూనే ఉన్నాడు.
దీంతో ఈ విషయాన్ని శాంతి ప్రియ తన తల్లిదండ్రులు చెప్పినప్పటికీ ఫలితం లేకపోయింది.ఒకవైపు ప్రేమ అంటూ ఓబులేసు చేసే ఆకృత్యాలు, మరోవైపు తల్లిదండ్రులు తన రోదన వినలేదని మనస్తాపానికి గురైనటువంటి శాంతిప్రియ ఆత్మహత్యే శరణ్యంగా తలచుకుంది.
దీంతో పని నిమిత్తం ఇంట్లోని కుటుంబ సభ్యులు బయటకు వెళ్ళగా తన గదిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.ఇది గమనించిన టువంటి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న టువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.అయితే మృతురాలి తల్లిదండ్రులు మాత్రం తమ కూతురు బతికున్నప్పుడు చెప్పినటువంటి మాటలు విని ఓబులేసుని మందలించి ఉంటే తమ కన్న కూతురు ఇప్పుడు బ్రతికి ఉండేది అంటూ పలువురు వాపోతున్నారు.
అలాగే ప్రేమ వేధింపులు ఆరోపణలు ఎదుర్కొన్న టువంటి నిందితు డు ఓబులేసు పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కుటుంబసభ్యులు పోలీసులు కోరుతున్నారు.