ఫ్లైఓవర్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య.. !  

telangana, hyderabad, women, suicide - Telugu Hyderabad, Suicide, Telangana, Women

పెళ్లి చేసుకోవడం లేదని క్షణికావేశంతో ఫ్లైఓవర్ పై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.

TeluguStop.com - Young Woman Commits Suicide By Jumping Over Flyover

సీతాఫల్ మండీలోని జోషి కంపౌండ్ ప్రాంతంలో పాండు అనే వ్యక్తి నివాసముంటున్నాడు.పాండుకు నలుగురు కుమార్తెలు.

రెండవ కుమార్తె పూజిత (19) ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుంది.ప్రస్తుతం ఖాళీగా ఉంటూ ఇంట్లోనే ఉంటుంది.

TeluguStop.com - ఫ్లైఓవర్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్య.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ప్రదీప్ అనే వ్యక్తితో పూజితకు పరిచయం ఏర్పడింది.స్నేహితులుగా పరిచయమై అదికాస్తా ప్రేమకు దారితీసింది.

గత మూడేళ్లుగా వీరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది.అయితే, ఈ మధ్యకాలంలో పూజిత తరచూ ప్రదీప్ ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసేది.

ప్రదీప్ కూడా సెటిల్ అయిన తర్వాత వివాహం చేసుకుందామని చెబుతూ వచ్చేవాడు.

ఇదిలా ఉండగా పూజిత బుధవారం రాత్రి 10.30 గంటలకు ప్రదీప్ కి కాల్ చేసి సీతాఫల్ మండీ ఫ్లైఓవర్ దగ్గరికి రమ్మంది.దీంతో ప్రదీప్, అతడి స్నేహితుడు బైక్ పై ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చారు.

పూజిత, ప్రదీప్ లు మాట్లాడుకున్నారు.ఈ క్రమంలో పూజిత ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని, త్వరగా పెళ్లి చేసుకోమని ప్రదీప్ ను అడిగింది.

దీంతో ప్రదీప్ కొన్నేళ్ల ఆగి పెళ్లి చేసుకుందామని చెప్పాడు.దీంతో ఇంకెన్నీ సంవత్సరాలు వేచి ఉండాలంటూ క్షణికావేశంలో పూజితా ఫ్లైఓవర్ పై నుంచి కిందికి దూకింది.

దీంతో పూజితకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

పూజిత తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

#Suicide #Hyderabad #Women #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Young Woman Commits Suicide By Jumping Over Flyover Related Telugu News,Photos/Pics,Images..