ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు.. కార‌ణం తెలిస్తే షాక‌వ్వాల్సిందే!

దేశంలో అమ్మాయిలు, మహిళలపై యాసిడ్ దాడులు చేస్తున్న సంఘటనలు ఎప్ప‌టిక‌ప్పుడు చూస్తూనే ఉన్నాం.ఈ యాసిడ్ దాడుల వ‌ల్ల ఎంద‌రో ఆడ‌వాళ్లు అంధ‌కారంలోకి వెళ్లిపోయారు.

 A Woman Second Time Acid Attack On His Lover At Kurnool District! Young Woman, A-TeluguStop.com

ప్రేమించ‌లేద‌నో, కోరిక తీర్చ‌లేద‌నో, మోసంచేశార‌నో.ఇలా ఏదో ఒక కార‌ణంతో కొంద‌రు మ‌గ‌వాళ్లు మాన‌వ‌త్వం మ‌ర‌చి యాసిడ్ దాడులు చేస్తూ.

ఆడవాళ్ళ జీవితాలను నిలువునా ముంచేస్తున్నారు.

అయితే ఇందుకు భిన్నంగా ఓ ప్రియురాలు.

ప్రియుడిపై యాసిడ్ దాడి చేసింది.ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్ద కొట్టాలలో నాగేంద్ర అనే యువ‌కుడు ఓ యువ‌తిని ప్రేమించాడు.

ఇద్ద‌రూ పెళ్లి కూడా చేసుకోవాల‌నుకున్నారు.కానీ, వీరిద్ద‌రి కులాలు వేరు కావ‌డంతో.

పెళ్లికి పెద్ద‌లు ఒప్పుకోలేదు.

దీంతో నా‌గేంద్ర గ‌త నెల‌లో మ‌రో యువ‌తిని పెళ్లాడాడు.

త‌నను ప్రేమించి.వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవ‌డం జీర్ణించుకోలేని ప్రియురాలు కోపంతో ర‌గిలిపోయింది.

ఈ క్ర‌మంలోనే నా‌గేంద్ర‌పై యాసిడ్ దాడి చేసింది.ఈ దాడిలో నాగేంద్ర తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు.దీంతో వెంట‌నే నాగేంద్ర‌ను స్థానిక హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు.

ప్ర‌స్తుతం నాగేంద్ర‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

కాగా, నాగేంద్రపై స‌ద‌రు యువతి యాసిడ్ దాడి చేయడం రెండోసారి కావ‌డం గ‌మ‌నా‌ర్హం.గ‌త వారం దాడి చేసిన‌ప్పుడు.

నాగేంద్ర చేయిపై యాసిడ్ ప‌డింది.ఆ గాయం మాన‌క‌ముందే.

రెండోసారి దాడి చేయ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.మ‌రోవైపు నాగేంద్ర త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.

విచార‌ణ చేప‌ట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube