నాట్యం సినిమాలో జూనియర్ ఎన్టీఆర్.. కానీ..?

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో పాటు పాన్ ఇండియా హీరోగా ఎదిగేందుకు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.కెరీర్ మొదట్లో మాస్ సినిమాల్లో ఎక్కువగా నటించిన ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి కథలో కొత్తదనం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాసినిమాకు నటుడిగా ఎదగడంతో పాటు తన స్థాయిని పెంచుకుంటున్నారు.

 Young Tiger Ntr Voice Over For Natyam Movie, Pan India, Natyam Movie, Rrr, Trivi-TeluguStop.com

ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తుండగా త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ కూడా మొదలుకానుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ సినిమాకు డైరెక్టర్ గా పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

అయితే ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ చిన్న సినిమాలకు కూడా తన వంతు సహాయం చేస్తున్నారు.గతంలో ఎన్టీఆర్ రామరామకృష్ణకృష్ణ అనే సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

కొన్ని నెలల క్రితం విడుదలైన ఆర్ఆర్ఆర్ టీజర్ కు కూడా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

Telugu Jr Ntr, Role, Natyam, Natyam Teaser, Pan India, Ramalingaraju, Sandhya Ra

ప్రస్తుతం ఎన్టీఆర్ మరో సినిమాకు కూడా వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.సత్యం రామలింగరాజు కోడలు సంధ్యరాజు లీడ్ రోల్ లో ఈ సినిమాలో నటిస్తుండగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమా టీజర్ నేడు ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల కానుండగా సినిమాకు కూడా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే వైరల్ అవుతున్న వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.ఈ సినిమాకు రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహిస్తుండగా శ్ర‌వ‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.రోహిత్ బెహ‌ల్, భానుప్రియ, కమల్ కామరాజు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఎన్టీఆర్ స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అనే సంగతి తెలిసిందే.

నాట్యంపై తనకు ఉన్న గౌరవాన్ని చాటుకోవడానికి ఎన్టీఆర్ వాయిస్ అందించబోతున్నాడని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube