'యంగ్ టైగర్ టాటూ' వేయించుకున్న మహిళా అభిమాని..పిక్ వైరల్!

సినిమాల్లో నటించే హీరోలకు అభిమానులు ఉండడం కామన్.తమ అభిమాన హీరోల కోసం ఎంత సాహసం అయినా చేయడానికి వెనుకాడరు.

 Young Tiger Ntr Tattoo On Girl Fan Hand-TeluguStop.com

మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ లో హీరోలను ఆరాధించిన విధంగా మరే ఇండస్ట్రీలో ఆరాధించారు.ఒక్కసారి ఆ హీరోను ఇష్టపడితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు.

ఇప్పటికే మన టాలీవుడ్ లో మెగా అభిమానులు, అక్కినేని అభిమానులు, నందమూరి అభిమానులు అని ఇలా తమ హీరోలను ఆరాధిస్తున్నారు.

 Young Tiger Ntr Tattoo On Girl Fan Hand-యంగ్ టైగర్ టాటూ’ వేయించుకున్న మహిళా అభిమాని..పిక్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తమ హీరోలపై వారికున్న అభిమానాన్ని చాటుకోవడానికి వారిని ఆకర్షించడానికి లేదంటే ఫేమస్ అవ్వడం కోసం కొంత మంది వింత వింత పనులు చేస్తూ ఉంటారు.

తాజాగా ఒక మహిళా అభిమాని ఒక వింత పని చేసి వార్తల్లో నిలుస్తుంది.ఇంతకీ ఆమె ఏం చేసిందో.ఎందుకు ఆమె వార్తల్లో నిలుస్తుందో.ఏ హీరో కూడా ఇదంతా చేసిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా.

బెంగుళూరుకు చెందిన ఒక యువతి తమ అభిమాన హీరో అయినా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం టాటూ వేయించుకుంది.

Telugu Bangalore Girl, Girl Fan, Nandamuri Fans, Ntr, Permanent Tattoo, Social Media, Tattoo, Tattoo On Girl Hand, Tollywood, Viral News, Viral Photo, Young Tiger Ntr-Movie

చేతి మీద యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని పోలి ఉండే విధంగా ఒక సింబల్ వేయించుకుంది.ఇది ఎప్పటికి ఉండేలా శాశ్వత టాటూ వేయించుకుంది.ఈ యువతీ చేసిన పనికి భిన్న వాదనలు ఎదురవుతున్నాయి.

ఆమె ఇంత పిచ్చి పని ఎందుకు చేసింది అని కొంతమంది అంటున్నారు.

Telugu Bangalore Girl, Girl Fan, Nandamuri Fans, Ntr, Permanent Tattoo, Social Media, Tattoo, Tattoo On Girl Hand, Tollywood, Viral News, Viral Photo, Young Tiger Ntr-Movie

మరి కొంతమంది మాత్రం ఈమెను సమర్థిస్తున్నారు.ఈమెలా చేయాలి అంటూ హీరోల అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు.ఇతర హీరోల అభిమానులు కూడా ఇలా చేయాలంటూ చెప్పుకుంటున్నారు.

వ్యతిరేకించేవారు మాత్రం అమ్మాయి అయి ఉండి ఇలా టాటూ వేయించుకోవడం ఏంటి అసలు తల్లిదండ్రులు ఈమెను ఎలా ప్రోత్సహిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు.అయితే ఆడవారు అయినంత మాత్రానా ఇలా టాటూ వేయించుకో కూడదా అందుతూ మరి కొంతమంది ప్రశ్నలు సంధిస్తున్నారు.

మొత్తానికి ఒక్క టాటూ కారణంగా సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది.

#Fan #Tattoo #Nandamuri Fans #Young Tiger NTR #Tattoo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు