అఖండ సినిమాకు ఎన్టీఆర్ రివ్యూ ఇదే.. బాలయ్యకు కంగ్రాట్స్ చెబుతూ?

Young Tiger Ntr Response For Akhanda Movie Details Here

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన అఖండ మూవీని వీక్షించారు.ఆ తర్వాత ట్విట్టర్, ఫేస్ బుక్ వేదికగా అఖండ సినిమా గురించి ఎన్టీఆర్ పాజిటివ్ గా కామెంట్లు చేశారు.

 Young Tiger Ntr Response For Akhanda Movie Details Here-TeluguStop.com

బాలకృష్ణకు, బోయపాటి శ్రీనుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభినందనలను తెలియజేశారు.అఖండ సినిమాను చూశానని అఖండ సినిమాతో రీసౌండింగ్ సక్సెస్ ను సొంతం చేసుకున్న బాల బాబాయ్ కు, అఖండ టీమ్ కు అభినందనలు అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.

అఖండ మూవీలో ఎంజాయ్ చేయడానికి ఎన్నో ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు.అఖండ సినిమా గురించి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన రివ్యూ నెట్టింట వైరల్ అవుతోంది.

 Young Tiger Ntr Response For Akhanda Movie Details Here-అఖండ సినిమాకు ఎన్టీఆర్ రివ్యూ ఇదే.. బాలయ్యకు కంగ్రాట్స్ చెబుతూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్ అఖండ సినిమాకు మరింత ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.బాలయ్య, తారక్ మధ్య దూరం పెరిగిందని వస్తున్న వార్తలకు ఎన్టీఆర్ చెక్ పెట్టారు.

వెకేషన్ కు వెళ్లి వచ్చిన ఎన్టీఆర్ నెలరోజుల పాటు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొననున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా అదే స్థాయిలో కలెక్షన్లను సాధించాల్సి ఉంది.

అయితే సంక్రాంతికి భారీ సినిమాలు రిలీజవుతూ ఉండటంతో ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్ల విషయంలో సంక్రాంతి పోటీ వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.

Telugu Akhanda, Response, Young Tiger Ntr-Movie

కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించారు.రాజమౌళి ,ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన నాలుగో సినిమా ఈ సినిమా కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తున్నారు.మెగా నందమూరి హీరోలను ఒకే సినిమాలో నటింపజేస్తూ రిలీజ్ కు ముందే జక్కన్న ఆర్ఆర్ఆర్ పై ఊహించని స్థాయిలో అంచనాలను పెంచేశారు.

#Response #Akhanda #Young Tiger NTR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube