ఆ సినిమాలో కృష్ణుని పాత్రలో కనిపించనున్న యంగ్ టైగర్.. ఫ్యాన్స్ కు పండగ అనేలా?

Young Tiger Ntr Playing Lord Krishna Role In War2 Movie Details Here Goes Viral , Ntr, Brindavanam , DEVARA Movie, Tollywood, War 2, Hrithik Roshan,

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( NTR )వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన బృందావనం ( Brindavanam )సినిమాలో కొన్ని సెకన్ల పాటు కృష్ణుని రోల్ లో కనిపించగా తారక్ అలా కనిపించడం ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చింది.తారక్ ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలలో వార్2 ఒకటి కాగా ఈ సినిమాలో హృతిక్ రోషన్, తారక్ మొదట స్నేహితులుగా ఉంటారని తర్వాత శత్రువులుగా మారతారని తెలుస్తోంది.

 Young Tiger Ntr Playing Lord Krishna Role In War2 Movie Details Here Goes Viral-TeluguStop.com
Telugu Brindavanam, Devara, Hrithik Roshan, Ntr, Lord Krishna, Tollywood, War-Mo

కృష్ణార్జునుల పాత్రలను రెఫరెన్స్ గా తీసుకుని కృష్ణుడి పాత్రను పోలి ఉండేలా తారక్ రోల్ ను, అర్జునుడి పాత్రను పోలి ఉండేలా హృతిక్ రోల్ ను ఫిక్స్ చేశారని సమాచారం అందుతోంది.ఫ్యాన్స్ కు పండగ అనే విధంగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.వార్2 సినిమాలో తారక్ రోల్ ఒకింత నెగిటివ్ షేడ్స్ తో ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.వార్2 సినిమా రిలీజయ్యేది 2025లోనే అని సమాచారం.

Telugu Brindavanam, Devara, Hrithik Roshan, Ntr, Lord Krishna, Tollywood, War-Mo

2024లో దేవర సినిమా( Devara )తో ప్రేక్షకుల ముందుకు రానున్న తారక్ 2025 సంవత్సరంలో మాత్రం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.తారక్ తన సినిమాల షూటింగ్ ను సైలెంట్ గా పూర్తి చేస్తుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.వరుసగా మూడు ప్రాజెక్ట్ లను తారక్ ప్రకటించగా ఈ సినిమాలను కొన్ని నెలల గ్యాప్ లో తారక్ థియేటర్లలో విడుదల చేస్తుండటం గమనార్హం.

తన సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ కు అనుగుణంగా జరిగేలా తారక్ ప్లాన్ చేస్తున్నారని సినిమాలకు సంబంధించి తన వైపు నుంచి ఏ పొరపాటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తారక్ తన సినిమాలలో ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube