పాన్ ఇండియా ఇమేజ్ తో సినిమాలు ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్ !

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్ మూవీగా ఈ సినిమాను 450 కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.

 Young Tiger Ntr Plans Pan India Movies-TeluguStop.com

ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

 Young Tiger Ntr Plans Pan India Movies-పాన్ ఇండియా ఇమేజ్ తో సినిమాలు ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మించబోతున్నారు.ఈ సినిమా ఏప్రిల్ 29 2022 న విడుదల చేయనున్నట్టు కూడా అప్పుడే ప్రకటించారు.

అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.

Telugu Atlee Kumar, Jr Ntr Latest Movies, Koratal Shiva, Mahesh Babu, Ntr, Ntr Pan India Movies, Ntr Plans Pan India Movies, Prasanth Neel, Rajamouli, Ram Charan, Rrr, Sanjay Leela Bhansali, Tollywood, Trivikram Srinivas-Movie

ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేయాల్సింది.కానీ కొన్ని కారణాల వల్ల త్రివిక్రమ్ మహేష్ తో సినిమా చేస్తుంటే ఎన్టీఆర్ కొరటాల తో సినిమా కమిట్ అయ్యాడు.అంతేకాదు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఒక ప్రాజెక్ట్ కమిట్ అవ్వడంతో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

కానీ ఇప్పుడు ఈ సినిమా కూడా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.

కొరటాల, ప్రశాంత్ నీల్ తో సినిమాలు అయినా వెంటనే త్రివిక్రమ్ తో సినిమా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది.

Telugu Atlee Kumar, Jr Ntr Latest Movies, Koratal Shiva, Mahesh Babu, Ntr, Ntr Pan India Movies, Ntr Plans Pan India Movies, Prasanth Neel, Rajamouli, Ram Charan, Rrr, Sanjay Leela Bhansali, Tollywood, Trivikram Srinivas-Movie

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచుకోబోతున్నాడు ఎన్టీఆర్.అందుకే వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.ఈ సినిమాలు తర్వాత అట్లీ తో కూడా ఒక సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

Telugu Atlee Kumar, Jr Ntr Latest Movies, Koratal Shiva, Mahesh Babu, Ntr, Ntr Pan India Movies, Ntr Plans Pan India Movies, Prasanth Neel, Rajamouli, Ram Charan, Rrr, Sanjay Leela Bhansali, Tollywood, Trivikram Srinivas-Movie

అంతేకాదు సంజయ్ లీలా బన్సాలి తో కూడా తారక్ ఒక సినిమా ఒప్పుకున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.మొత్తానికి ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

#NtrPan #Mahesh Babu #SanjayLeela #NtrPlans #Atlee Kumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు