రామ్ హీరోగా లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కిన ది వారియర్ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే.ది వారియర్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచగా ఈ నెల 14వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ అనంతపురంలో జరగగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు హీరో రామ్ ను భయపెట్టడం గమనార్హం.వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఈ విధంగా నిజంగా జరిగింది.
ది వారియర్ ఆడియో లాంఛ్ ఈవెంట్ లో కొంతమంది అభిమానులు రచ్చరచ్చ చేయడంతో పాటు స్టేజ్ పైకి వచ్చారు.యాంకర్ శ్యామల ఎంత రిక్వెస్ట్ చేసినా అభిమానులు మాత్రం రచ్చ చేయడం ఆపలేదు.
కొంతమంది ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ స్లోగన్స్ చెప్పడంతో పాటు వేదికపైకి రాళ్లు విసిరారు.బోయపాటి శ్రీను తన స్పీచ్ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడకపోవడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను హర్ట్ చేసింది.
ఈ కారణం వల్లే అభిమానులు ఈ విధంగా చేశారని సమాచారం.హీరో రామ్ సైతం అభిమానులు సృష్టించిన భయానక వాతావరణం వల్ల తక్కువ సమయంలోనే తన స్పీచ్ ను ముగించారు.
రామ్ మాట్లాడుతూ ఫ్యాన్స్ దెబ్బకు అందరూ భయపడి పారిపోతున్నారని తెలిపారు.అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ విధంగా చేయడాన్ని అస్సలు ఎంకరేజ్ చేయరనే సంగతి తెలిసిందే.
ఇతర హీరోల ఈవెంట్లలో తన గురించి నినాదాలు చేయడం తారక్ కు అస్సలు నచ్చదు.ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్ దృష్టికి వస్తే తారక్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం బరువు తగ్గుతుండగా తారక్ కొత్త లుక్ ప్రేక్షకులకు షాకిచ్చే విధంగా ఉండనుందని తెలుస్తోంది.