నేటితరం యువత వాచ్( Watches ) లను ధరించడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు.తక్కువ ధరకే బ్రాండెడ్ వాచ్ లు అందుబాటులో ఉన్నా వాచ్ లను కొనుగోలు చేయడంపై యువత శ్రద్ధ పెట్టడం లేదు.
అయితే సెలబ్రిటీలు మాత్రం ఖరీదైన వాచ్ లను కొనుగోలు చేస్తూ ఆ వాచ్ ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.టిల్లూ స్క్వేర్ మూవీ( Tillu Square Movie ) ఈవెంట్ కు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హాజరై అదే సమయంలో దేవర సినిమాపై కూడా అంచనాలు పెంచిన సంగతి తెలిసిందే.
అయితే ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు తెలిసి షాకవ్వడం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వంతవుతోంది.
ఎన్టీఆర్( Junior NTR Watch Cost ) ధరించిన వాచ్ ఖరీదు కోటీ 57 లక్షల 32 వేల 455 రూపాయలు కావడం గమనార్హం.ఆడేమార్స్ పిగెట్ రాయల్ ఓక్ బ్రాండ్ కి చెందిన వాచ్ ను తారక్ కొనుగోలు చేశారు.ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం( NTR Remuneration ) తీసుకునే తారక్ కోటిన్నర ఖర్చు చేసి వాచ్ కొనుగోలు చేయడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు దేవర సినిమాకు సంబంధించి ఈరోజు అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.ఈ సినిమా నార్త్ థియేట్రికల్ రైట్స్ ను ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది.హిందీలో బాహుబలి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన ధర్మ ప్రొడక్షన్స్ దేవర సినిమా( Devara Movie )ను నార్త్ లో డిస్ట్రిబ్యూట్ చేయడం గమనార్హం.
దేవర కరణ్ జోహార్( Karan Johar ) చేతుల మీదుగా విడుదల కావడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర ఈ ఏడాది అక్టోబర్ నెల 10వ తేదీన( Devara Release Date ) థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ సినిమా రిలీజ్ కు సరిగ్గా ఆరు నెలల సమయం ఉంది.
దేవర మూవీ ఆలస్యమవుతున్నా ఆ ఆలస్యాన్ని మరిపించేలా సినిమా ఉంటుందని తారక్ ఇప్పటికే ఫ్యాన్స్ కు హామీ ఇచ్చారు.ఈ సినిమాకు సంబంధించి తారక్ ఒక డైలాగ్ ను కూడా లీక్ చేసిన సంగతి తెలిసిందే.
తారక్ వాచ్ అమ్మితే లైఫ్ సెటిల్ అవుతుందంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.