బిగ్ బ్రేకింగ్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్..?

2019 సంవత్సరం డిసెంబర్ నెలలో చైనాలో విజృంభించిన కరోనా మహమ్మారి ఇతర దేశాలకు వ్యాప్తి చెందిన సంగతి తెలిసిందే.కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో మరింత వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతోంది.

 Young Tiger Junior Ntr Tested Corona Positive-TeluguStop.com

ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడగా తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కరోనా నిర్ధారణ అయింది.ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా తనకు కరోనా సోకినట్టు వెల్లడించారు.

అయితే కరోనా సోకినందుకు అభిమానులు ఏ మాత్రం కంగారు పడవద్దని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సూచనలు చేయడం గమనార్హం.కరోనా నిర్ధారణ అయినా ప్రస్తుతం తను ఆరోగ్యంగానే ఉన్నానని ఎన్టీఆర్ పేర్కొన్నారు.

 Young Tiger Junior Ntr Tested Corona Positive-బిగ్ బ్రేకింగ్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తనతో పాటు తన కుటుంబ సభ్యులు సైతం ఐసోలేషన్ లో ఉన్నారని వైద్యుల సలహాలు, సూచనల ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

ఎవరైతే తనను ఈ మధ్య కాలంలో కలిశారో వాళ్లు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఎన్టీఆర్ సూచనలు చేశారు.మరో పదిరోజుల్లో ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండగా ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ కరోనా బారిన పడటం గమనార్హం. ప్రస్తుతం సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ లు ఆగిపోవడంతో ఎన్టీఆర్ కు కరోనా సోకినా ఆ ప్రభావం సినిమాలపై పడే అవకాశం అయితే లేదని చెప్పవచ్చు.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా తరువాత కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.ఎన్టీఆర్ కొత్త సినిమాలకు సంబంధించి మరికొన్ని వార్తలు వస్తున్నా ఆ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది.

ఎన్టీఆర్ కు కరోనా నిర్ధారణ కావడంతో ఆయన త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పూజలు చేస్తున్నారు.

#NtrFamily #Corona Positive #Ntr Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు