ప్రస్తుతం సోషల్ మీడియాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Young Tiger Jr.NTR ) కొత్త లుక్ వైరల్ అవుతుండగా తారక్ కొత్త లుక్ అద్భుతంగా ఉందని కిర్రాక్ లుక్ లో తారక్ అదుర్స్ అనిపిస్తున్నాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కొత్త యాడ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ 6 నుంచి 8 కోట్ల రూపాయల రేంజ్ లో ఛార్జ్ చేస్తున్నాడని తెలుస్తోంది.అయితే ఏ కంపెనీకి సంబంధించిన యాడ్ లో తారక్ నటించనున్నారో తెలియాల్సి ఉంది.
తారక్ సినిమా సినిమాకు లుక్ ను మార్చుకుంటుండగా యాడ్స్ విషయంలో కూడా వైవిధ్యం చూపిస్తున్నారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు.
తారక్ తండ్రీ కొడుకుల రోల్స్ లో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ కాగా ఈ సినిమా మాత్రం కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

దేవర( devara ) సినిమాలో తారక్ సొంత బ్యానర్ నిర్మాణ భాగస్వామిగా ఉంది.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్, అయాన్ ముఖర్జీ ( Prashant Neel, Ayan Mukherjee )డైరెక్షన్ లో తర్వాత సినిమాలు ఫిక్స్ కాగా ఈ సినిమాలు కూడా భారీ లెవెల్ లో ఉండనున్నాయి.2023 సంవత్సరంలో తారక్ నటించిన సినిమాలేవీ విడుదల కావడం లేదు.అయితే వచ్చే ఏడాది నుంచి ప్రతి సంవత్సరం తారక్ సినిమా ఒక్కటైనా రిలిజ్ కానుంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాస్ యాక్షన్ సినిమాలకు ఎక్కువగా పెద్ద పీట వేస్తున్నారు.ఈ సినిమాలు మరింత ప్రత్యేకంగా ఉండటంతో పాటు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు ఉన్న తారక్ ఇమేజ్ ను పది రెట్లు పెంచడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరిన్ని భారీ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.







